ఎన్నికలు సమీపించిన వేళ.. జగన్ బయోపిక్‌పై కొత్త అప్‌డేట్

Yatra 2: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న మూవీ.. యాత్ర 2 (Yatra 2). మహీ వీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్‌. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీ అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది.

వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి జీవించారు. రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో అనసూయ.. కీలక పాత్రల్లో నటించారు. 2019 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర విడుదలైన ఈ సినిమా అప్పట్లో పొలిటికల్ సెన్సేషన్‌గా మారింది.

Yatra 2 teaser will be release on January 5

ఇప్పుడా సినిమాకు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉందా మూవీ. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తోన్నారు. ఇందులో కూడా వైఎస్సార్ క్యారెక్టర్ ఉంది. మమ్ముట్టే ఆ పాత్రను పోషిస్తోన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది ఈ మూవీ.

2024 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ విడుదలయ్యాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. యాత్ర తరహాలోనే ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

వైఎస్సార్, వైఎస్ జగన్, వైఎస్ భారతి, సోనియా గాంధీ క్యారెక్టర్లను పరిచయం చేశారు దర్శకుడు మహీ వీ రాఘవ్. ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అవన్నీ కూడా సినిమాపై మంచి అంచనాలను ఏర్పడేలా చేశాయి. యాత్ర తరహాలో దాని సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవుతుందనే అభిప్రాయాన్ని కలిగించాయి.

తాజాగా- ఈ సినిమాపై మరో అప్ డేట్ ఇచ్చాడు మహీ వీ రాఘవ్. టీజర్ విడుదల అయ్యే తేదీని ప్రకటించాడు. ఈ నెల 5వ తేదీన టీజర్ విడుదల అవుతుందని తెలిపాడు. ఫిబ్రవరి 8వ తేదీన సినిమాను విడుదల కానుంది. దానికి వారం రోజులు ముందే విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+