బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల..
యంగ్ బ్యూటీ శ్రీలీల.. టాలీవుడ్ సెన్సేషన్ గా మారింది. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ. పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. తెలుగు, తమిళ్ సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది. హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో చివరగా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్ లో మరో ఆఫర్ దక్కించుకుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
బాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ప్రకారం.. జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ నటించిన 'దోస్తానా' పెద్ద హిట్టే అయింది. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా దోస్తానా-2 తెరకెక్కించబోతున్నారు. ఆ చిత్రంలో శ్రీలీల ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే కార్తీక్ ఆర్యన్, 'కిల్' ఫేమ్ లక్ష్య, జాన్వీ కపూర్‌లతో.. ఈ సీక్వెల్ తెరకెక్కించాలని ప్లాన్ చేశారట.

కానీ ఇప్పుడు కార్తీక్ స్థానంలో విక్రాంత్ మాసే, జాన్వీ స్థానంలో శ్రీలీలను ఎంపిక చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అద్వైత్ చౌహాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని కరణ్ జోహార్ భావిస్తున్నారట.
మరోవైపు శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రవితేజతో ఓ సినిమా చేస్తుంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది. అటు తమిళ్ లో కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. అంతే కాకుండా రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఐటం సాంగ్ లో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.












Click it and Unblock the Notifications