చేతులు కలిపిన సందీప్ రెడ్డి వంగా - కిరణ్ అబ్బవరం
సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్‌తోనే యువతలో మంచి బజ్ క్రియేట్ చేసిన 'జిగ్రీస్' సినిమా నుంచి తాజాగా తొలి పాట విడుదలైంది. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండే ఈ పాటను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేశారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
'తిరిగే భూమి' పాటపై కిరణ్ అబ్బవరం ప్రశంసలు
ఈ పాట విడుదల అనంతరం కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, "ఈ పాటలోని ట్యూన్ చాలా ఫ్రెష్‌గా ఉంది. కమ్రాన్ సయ్యద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీజర్ చూశాను, చాలా బాగా నచ్చింది. నేను ఒకప్పుడు కొత్తవాడినే కాబట్టి కొత్తవాళ్ళ పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఈ టీమ్ చాలా ప్యాషన్‌తో పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నానని అన్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ ఈ ఈవెంట్‌కు హాజరవడం 'జిగ్రీస్' టీమ్‌పై ఆయనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.

'జిగ్రీస్' చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డిజిటల్ మార్కెటింగ్ బాధ్యతలను బిగ్ ఫిష్ మీడియా నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications