చిరంజీవిపై చెయ్యి వేసిన యంగ్ హీరో
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన్ను కలవాలని, ఆయనతో ఫొటో దిగాలని ఎంతోమంది పరితపిస్తుంటారు. తమ అభిమాన హీరోతో ఒకసారి ఫొటో దిగినా చాలని జీవితకాలం ఎదురుచూసేవారు కూడా ఉంటారు. మెగాస్టార్ అంటే ఎల్లల్లేని అభిమానాన్ని చూపిస్తుంటారు. చిరంజీవి కూడా తనను కలిసినవారిని బాగా ప్రోత్సహిస్తారు. తాజాగా అటువంటి సందర్భం ఒకటి ఎదురుకాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
ప్రత్యేకంగా అభినందించిన చిరంజీవి
నాగబాబు కుమార్తె నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను చూసిన మహేష్ బాబు, నానితోపాటు పలువురు సెలబ్రిటీలంతా నిహారికను మెచ్చుకున్నారు. చిరంజీవి కూడా ఈ సినిమా చూసి బాగుందని మెచ్చుకోవడంతోపాటు సినిమా బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించి అభినందించారు. కమిటీ కుర్రోళ్లంతా చిరంజీవితో ఫొటోలు దిగారు. ఇలా ఫొటోలు దిగే క్రమంలో సినిమా హీరోల్లో ఒకరైన యశ్వంత్ చిరంజీవి వీపుపై చేయి వేశాడు. అయితే దీన్ని గమనించిన చిరు అసిస్టెంట్ వెంటనే వచ్చి అతని చెయ్యిని చిరు వీపుమీద నుంచి తీసేస్తాడు.

"వేసుకో.." @KChiruTweets 💚💚 pic.twitter.com/nZyxQxsTvf
— Harish R.Menon (@27stories_) August 20, 2024
కంగారుపడ్డ యశ్వంత్
అసిస్టెంట్ వచ్చి చేయిని తీసేయడంతో యశ్వంత్ కంగారుపడతాడు. దీంతో అక్కడున్నవారంతా ఏం జరిగిందో అర్థంకాక ఆశ్చర్యపోతారు. అయితే వెంటనే చిరంజీవి తన అసిస్టెంట్ తో.. వారు కుర్రాళ్లు.. అలాగే ఉంటారు.. ఇబ్బంది పెట్టకూడదంటారు. నువ్వు చెయ్యి వేసుకో పర్వాలేదు అంటూ యశ్వంత్ చేయి తనవైపు లాక్కొని వీపుమీద వేసుకుంటారు. చిరంజీవి చేసిన ఈ పని చూసి అభిమానులంతా మురిసిపోతున్నారు. చిరంజీవిలో ఉన్న గొప్పతనానికి, నిరాడంబరతకు ఇది నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అంత గొప్పతనం ఉండబట్టే చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications