సోషల్ మీడియా సెలబ్రిటీ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి.. విషాదంలో ఫ్యాన్స్!

సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో నవ్వులు పంచిన ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చ'అలియాస్ కిరణ్ కుమార్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువీకరించారు.

Jailer 2 Censor Review: రజనీకాంత్ 'జైలర్ 2' సెన్సార్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ లోడింగ్..!!
Jailer 2 Censor Review: రజనీకాంత్ 'జైలర్ 2' సెన్సార్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ లోడింగ్..!!

'అగ్గిపెట్టె మచ్చ' అనే ప్రత్యేకమైన పేరుతో సోషల్ మీడియాలో కిరణ్ కుమార్ అడుగుపెట్టి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన మాట్లాడే తీరు, ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, విలక్షణమైన హావభావాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లో ఆయన చేసిన చిన్న చిన్న వీడియోలు, రీల్స్ క్షణాల్లో వైరల్ అయ్యేవి. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీ కారణంగా పలు ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లు, కంటెంట్ క్రియేటర్లు ఆయనతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు.

Popular YouTuber and Comedian Aggipette Macha Kiran Kumar Passes Away due to illness in Tirupati

సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో కిరణ్ కుమార్ కేవలం డిజిటల్ మాధ్యమానికే పరిమితం కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లోనూ సందడి చేశారు. ఎక్కడ కనిపించినా తనదైన యాస, జోకులతో అందరినీ నవ్విస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన ప్రదర్శించిన కామెడీ స్కిట్లు, పంచ్ డైలాగులు యువతలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఆయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేస్తున్నారు.

అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టు ఆగిపోయిందా? అసలు నిజమేంటి?
అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టు ఆగిపోయిందా? అసలు నిజమేంటి?

గత నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్ ను కుటుంబ సభ్యులు తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయితే వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూయడంతో కుటుంబంలోనూ, ఆయనను ఇష్టపడే లక్షలాది మంది అభిమానుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కిరణ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+