Fact Check : రాష్ట్రపతి ఆవిష్కరించిన ఆ చిత్రపటం నేతాజీది కాదా..?
భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈ నెల 23న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటోలో ఉన్నది నేతాజీ కాదని... 2019లో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'గుమ్నామీ' సినిమాలో బోస్ పాత్ర పోషించి ప్రొసెన్‌జిత్ ఛటర్జీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొయిత్రా కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 'రామ మందిర నిర్మాణం కోసం రూ.5లక్షలు విరాళం ఇచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... ఆ తర్వాత నేతాజీ గౌరవార్థం ప్రసేన్‌జిత్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ప్రసేన్‌జిత్ నేతాజీ బయోపిక్‌లో నటుడు. భగవంతుడా భారత్‌ను కాపాడు...' అంటూ ఎద్దేవా చేశారు.

బీజేపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. అసలు ఆ ఫొటో ప్రసేన్‌జిత్‌లాగా అనిపించడం లేదని, అనవసరంగా లేని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.నేతాజీ ఒరిజినల్ ఫోటో ఆధారంగా పరేష్ మైటీ అనే చిత్రకారుడు ఆయన చిత్రాన్ని గీశారని సీనియర్ జర్నలిస్ట్ నిస్టుల హెబ్బార్ తెలిపారు. పరేష్ మైటీని 2014లో కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్‌లో జన్మించిన పరేష్ మైటీ తక్కువ కాలంలోనే గొప్ప చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Fact Check
వాదన
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతాజీ చిత్రపటానికి బదులు ప్రసేన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
వాస్తవం
పరేష్ మైటీ గీసిన నేతాజీ ఒరిజినల్ ఫోటో ఆధారంగా రూపొందించిన చిత్రపటాన్నే రాష్ట్రపతి ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications