Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fact Check : నిజమేనా... పాత రూ.10,రూ.5 కాయిన్లతో లక్షలు సంపాదించవచ్చా..?

మీవద్ద పాత రూ.10,రూ.5 కాయిన్స్ ఉంటే చాలు బోలెడు డబ్బు సంపాదించవచ్చంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఆ పోస్టుల ప్రకారం... పాత రూ.10,రూ.5 కాయిన్స్‌ను విక్రయించడం ద్వారా లక్షల రూపాయల డబ్బు సంపాదించవచ్చు. మీవద్ద ఉన్న కాయిన్స్‌పై వైష్ణోదేవీ మాత బొమ్మ ఉంటే వేలంలో లక్షల రూపాయలు వస్తాయి. ఇప్పుడీ కాయిన్లకు భారీ డిమాండ్ ఉంది. లక్షలు వెచ్చించి వీటిని వేలంలో కొనుక్కుంటున్నారు.

fact check is it true can you earn lakhs by selling old rs 10 and rs 5 coins

రూ.5నోటును సుమారు రూ.30వేల వరకు విక్రయించవచ్చు. అయితే ఆ నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. ఒకవేళ ఆ నోటుపై 786 నంబర్ ఉంటే మరింత ఆకర్షనీయణమైన మొత్తం మీ సొంతమవుతుంది.

ఇటీవల కాయిన్ బజార్ అనే వెబ్‌సైట్ తమ సైట్‌లో ఒక ప్రకటన ఇచ్చింది. ఒకవేళ మీవద్ద పాత రూ.1 నోటు ఉండి... అది ఆ వెబ్‌సైట్ నిర్దేశించిన ప్రమాణాలను కలిగి ఉంటే మీరు రూ.45వేలు వరకు పొందవచ్చు. ఇందుకోసం మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి... మీవద్ద ఉన్న కరెన్సీ కాయిన్ లేదా నోటు ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయాలి. దాంతో అది వేలానికి అందుబాటులోకి వస్తుంది. అలా ఎవరైనా తమకు ఆసక్తి ఉంటే మిమ్మల్ని సంప్రదించి వాటిని కొనుగోలు చేస్తారు.

ఆ వెబ్‌సైట్ పెట్టిన షరతుల్లో ఒక షరతు ఇలా ఉంది. మీవద్ద రూ.1 నోటు ఉండి ఉంటే... దానిపై 1957 నాటి గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం,సీరియల్ నంబర్ 123456 ఉండాలి.

నిజానికి రూ.1నోటును భారత ప్రభుత్వం 26 ఏళ్ల క్రితమే నిలిపివేసింది. కానీ 2015లో ఆ నోటు తిరిగి సర్క్యులేషన్‌లోకి వచ్చింది. ఏదేమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పాత వాటికి ఉండే విలువే వేరు. అందుకే పాత కాయిన్లకు,కరెన్సీ నోట్లకు వేలంలో ఆకర్షణీయ మొత్తం లభిస్తోంది.

Fact Check

వాదన

పాత రూ.10,రూ.5 కాయిన్లు,పాత రూ.1 నోటును విక్రయించడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

వాస్తవం

ఒక వెబ్‌సైట్ ఇందుకోసం వేలం నిర్వహిస్తోంది. అయితే ఇక్కడ చాలా కండిషన్స్ ఉంటాయి.

రేటింగ్

True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+