Fact Check: పోలీసుపై వైసీపీ సపోర్టర్ దాడి..వీడియో వైరల్-వాస్తవమేంటి..?

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చాలా వరకు బూటకపు వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట ఆన్‌లైన్‌లో కనిపించిన కొన్ని వీడియోలను కొందరు ఇప్పుడు తాజా వీడియోలుగా సోషల్ మీడియాలో పోస్టు చేసి తృప్తి పొందుతున్నారు. అంతేకాదు తమ ప్రత్యర్థి పార్టీలకు దాన్ని జోడించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై ఫేక్ పోస్టులతో రెచ్చిపోతున్నాయి. ఎప్పుడో వచ్చిన పాత వీడియోను తీసుకొచ్చి తమ ప్రత్యర్థి పార్టీలకు అనుసంధానిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. తాజాగా టీడీపీ మద్దతు సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి పోలీస్ అధికారిపై చేయి చేసుకోవడం కనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ రమణారెడ్డి అని తాగిన మత్తులో పోలీసుపై దాడి చేస్తున్నాడంటూ పోస్టు చేశారు.

Fact Check fake video viral

అయితే ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించిన మీదట అది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంకు సంబంధించిన వీడియో కాదని తేలింది. 2018లో ఈ వీడియో తమిళనాడులో వైరల్ అయ్యింది. వీడియోలో పోలీసు కానిస్టేబుల్‌ పై దాడి చేస్తున్న వ్యక్తి మణికందన్ అనే కాలేజీ విద్యార్థి.బైకు పై మణికందన్‌తో పాటు మరో ఇద్దరు వెళుతుండగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసు కానిస్టేబుల్ మగేశ్వరన్ ఆపాడు. దీంతో మణికందన్ పోలీసును దుర్భాషలాడుతూ అతనిపై చేయి కూడా చేసుకున్నాడు. ఇదంతా చాలా బహిరంగంగా జరిగింది. ఆ సమయంలో అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. 2018 డిసెంబర్ 24వ తేదీన చెన్నైలోని జాఫర్‌ఖాన్‌ పేట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదే వీడియోను తిరిగి టీడీపీ మద్దతుదారులు వైసీపీ నాయకులకు అంటగట్టి సర్క్యులేట్ చేస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

Fact Check

వాదన

పోలీసుపై తాగిన మత్తులో చేయి చేసుకున్న వైసీపీ మద్దతుదారుడు

వాస్తవం

2018లో చెన్నైలో పోలీస్ కానిస్టేబుల్ పై మణికందన్ అనే విద్యార్థి దాడి చేశాడని తేలింది

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+