• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: కంగనా రనౌత్‌కు అంబానీ కుటుంబం రూ.200 కోట్లు ఇస్తోందా..? ఎందుకు..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రస్తుతం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు. అదే సమయంల ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. మహారాష్ట్ర సర్కార్ పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం, బాంద్రాలోని ఆమె కార్యాలయంను ఉద్ధవ్ ప్రభుత్వం కూల్చడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ సమయంలో చాలామంది కంగనా రనౌత్‌కు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టు చాలా ఆసక్తిని రేపుతోంది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యవహారం నానాటికీ ముదురుతోంది. నేరుగా మహా సర్కారును ఆమె ఢీకొనడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది. అంతే స్థాయిలో కంగనాకు మద్దతు లభిస్తోంది. ఇక కంగనా రనౌత్‌ కొత్త స్టూడియో కట్టుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ రూ.200 కోట్లు ఇచ్చారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమయంలో ఈ వార్త వైరల్ కావడంతో చాలా మంది దీనిపై ఆరా తీస్తున్నారు.

కంగనాకు సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతున్న క్రమంలో ఈ పోస్టును కూడా పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు నెటిజెన్లు. అయితే కొత్త స్టూడియో నిర్మాణం కోసం అంబానీ కుటుంబం రూ. 200 కోట్లు ఇస్తోందంటూ వస్తున్న వార్తలను నిర్థారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాదు రిలయన్స్ సంస్థ నుంచి కూడా ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.

Fact Check:News making rounds that Ambanis are giving Rs 200 crore to Kangana is false

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ప్రచారంలో ఉన్న వార్త అవాస్తవమని చెప్పినట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఇండియా టుడే పేర్కొంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి చేరుకున్న కంగనా రనౌత్ కొన్ని వీడియోలను ట్విటర్‌లో పోస్టు చేసింది. తను నివాసం రామ్‌ మందిర్ అని పేర్కొన్నారు. అదే సమయంలో శివసేన పై ఆమె విరుచుకుపడ్డారు. ఉద్దవ్ థాక్రేపై నిప్పులు చెరిగారు. ఆమె ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే శివసేన కార్యకర్తలు విమానాశ్రయం బయట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అదే సమయంలో కంగనాకు మద్దతుగా కర్ణిసేన కూడా స్లోగన్లు అందుకుంది.

Recommended Video

  End of Pandemic?డిసెంబర్ 3 నాటికి దేశంలో కరోనా వైరస్ అంతం : Times Fact-India Outbreak Report

  తన ఇంటిని ఎలాగైతే కూల్చారో అలాగే ఉద్ధవ్ థాక్రే ఈగో కూడా ధ్వంసం అవుతుందంటూ నిప్పులు చెరిగారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని థాక్రే గుర్తుంచుకోవాలంటూ కంగనా ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె అయోధ్య మీద సినిమా చేస్తుండగా కశ్మీరీల కష్టం కూడా తాను తెలుసుకున్నట్లు చెప్పిన కంగనా.. కశ్మీరీల కష్టాలపై కూడా సినిమా తీస్తానని వెల్లడించింది.

  Fact Check

  వాదన

  కొత్త స్టూడియో నిర్మాణం కోసం కంగనాకు రూ. 200 కోట్లు ఇచ్చిన అబానీ కుటుంబం

  వాస్తవం

  రిలయన్స్ సంస్థ కానీ అంబానీ కుటుంబం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు

  రేటింగ్

  False
  ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు factcheck@one.in కు మెయిల్ చేయండి

  English summary
  There is a news making rounds on social media that Kangana Ranaut is being offered Rs.200 crore from Ambani to build a new studio. The claim seems to be false as there was no official statement from Reliance industries.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X