వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగంబరకవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయనరాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యంఅనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిదిపదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపైఆయన కలం నిప్పులు కక్కుతుంది.

By Staff
|
Google Oneindia TeluguNews

పురపాలక,నగరపాలక ఎన్ని కల్లోలాలు యామధ్యనే ముగిసాయి. ఫలితాలు లేకజాతకాలు దాదాపు వెంటనే వెలువడ్డాయి.గెలిచినవారు ఆనందోత్సాహాల్లో మునిగీ,ఓడినవారు విషాదాంబుధిలో ములిగీ యింకాలేవలేదు. తేలడానికీ,తేరుకోవడానికీ కొంత సమయంపడుతుంది. ఆ తరువాత ఎవరుఎటువంటి పాత్ర ధరిస్తారో వహిస్తారోప్రవర్తిస్తారో కాలం తెరపై చూడవలసివుంటుంది.నేను,ప్రస్తుతమున్న ఏ రంగు రాజకీయపార్టీకీ చెందినవాడిని కాదు. కాని,మనకు పటిష్టమైన,సమర్థవంతమైన,బాధ్యతాయుతమైన ప్రభుత్వంవుండి తీరాలనే వాడిని. ప్రజాస్వామ్యవిలువలపై నడిచే, కాపాడే,ఆచరించేటటువంటి పార్లమెంటరీ పంథాకావాలనే వాడిని. ఆ మార్గంలోనే మనఎన్నికలు జరుగుతున్నాయా? ఆ లక్ష్యం గలప్రభుత్వాలే ఏర్పడుతున్నాయా? మనంమన ప్రతినిధులను ఎన్నుకునేఎన్నికలొచ్చాయని సంబరపడుదామా,మనని రక్షించే గర్వించదగ్గ పాలనావ్యవస్థలు ఏర్పడతాయని ఆశిద్దామా?భీకరంగామనపై దాడి చేస్తూ అసంఖ్యాకజననష్టానికి కారణమవుతున్నవిపత్తులు అనేకం వున్నాయి. అవి....తుఫాన్లు, వరదలు, కరువులు,కాటకాలు మొదలైనవి. స్వాతంత్య్రంవొచ్చాక వాటికి మరో విపత్తు కూడాచేరింది. అదే - ఎన్నికలు, తర్వాతప్రభుత్వాల ఏర్పాటు, ఆ ప్రభుత్వాలనునిలబెట్టుకోవడానికి సాగే దారుణప్రహసనాలు. క్రమంగా యివి పెరుగుతూవొచ్చాయే గాని తగ్గడం గాని, అందుకుప్రయత్నం గాని జరగలేదు.ఉదాహరణకుగతంలో ఒక మంత్రివర్గాన్ని పడగొట్టితిరిగి ఎన్నికలు తీసుకురావాలనే ఆలోచనలుజరిగేవి; లేక ఒక ముఖ్యమంత్రిని పదవినుండి తప్పించి మరొకరుఆక్రమించడానికి ప్రజల్లో అలజడి అల్లకల్లోలంరేపి కర్ఫ్యూ విధించే వరకుభయాందోళనల పరిస్థితి తీసుకొచ్చేవారు.ఇలాంటి విషవ్యూహాలు అనేకం జరిగేవి.ఇదంతాసుస్థిరత, ప్రజాస్వామ్యం, మతసామరస్యం, ప్రజా క్షేమం పేర జరిగేవి.దీనికి కర్తలైన రేచుక్కల వంటిరాజకీయ నాయకుల సంఖ్య పెరుగుతూవస్తున్నది. ఇవాళ రాజకీయ హైటెక్‌వ్యాపారం. ఈ రాజకీయ నాయకులు కొత్తకలుం, కొత్త వర్గానికి చెందినవారు. ఈహైహై వ్యాపారానికి షార్ట్‌కట్‌రాజ్యాధికారం. అది ఎంత చిన్నరాజకీయాధికారమైనా, దాని కోసంఎంతటికైనా తెగబడే తండాలుఏర్పడ్డాయి. నిన్నటి వరకు రాజకీయంవ్యాపారరంగం మాత్రమే, యివాళ అదినేరాల పుట్ట కూడా. తాజా వుదాహరణమొన్న జరిగిన పుర, నగరపాలకఎన్నికలు జరిగిన తీరు. నేను ఏ ఒక పార్టీనో, ఏకొందరు వ్యక్తులనో దృష్టిలో పెట్టుకునిచెప్పడం లేదు. మొత్తం ఎన్నికలక్షేత్రం ఎలా వుందో గమనించమనిచెబుతున్నాను.ఎన్నికలుతమ సేవకై ప్రజలు ప్రతినిధులనుస్వేచ్ఛగా ఎన్నుకునే ప్రక్రియ. ఈనాడు యాప్రజాసేవ చెయ్యడానికి వేలమంది పోటీపడుతున్నారు. కోట్లు ఖర్చుపెడుతున్నారు. ప్రత్యర్థుల్నిఅపహరిస్తున్నారు. బెదిరిస్తున్నారు.కొనేస్తున్నారు. అరాచకానికిదిగుతున్నారు. లొంగకపోతేదౌర్జన్యానికి దిగుతున్నారు. ఆస్తులనుధ్వంసం చేస్తున్నారు. పాతకక్షలుతీర్చుకుంటున్నారు. చివరకు హత్యలుచేస్తున్నారు. ఇదంతా శాంతిపేర,ప్రజాస్వామ్యం పేర, ప్రజాసేవ పేరజరుగుతున్నది. మద్యం తాగించి, డబ్బుతోఓట్లు కొని, ప్రజల మధ్య ద్వేషాన్నిరేకెత్తించే, ఎన్నిటికీ చల్లారని కక్షలూకార్పణ్యాలు ఎగదోసే ఉన్మాదభాషనుపయోగించి బీభత్సంసృష్టించడం, పేట్రేగిపోవడం, ప్రాంతాలమధ్య, ప్రజల మధ్య, కుటుంబాలమధ్య, వ్యక్తుల మధ్య వున్నసున్నిత సంబంధ బాంధవ్యాలను,భావాలను దుర్మార్గంగాచిదిమివెయ్యడం... యా రాజకీయ సంస్కారంమనని ఎక్కడికి తీసుకెడుతున్నది?తుపాకీద్వారానే రాజ్యాధికారం తమసిద్ధాంతంగా ప్రకటించేమావోయిస్టులను అర్థం చేసుకోవచ్చు.కాని, మాకు ఆయుధంలో నమ్మకంలేదంటూనే శాంతి వచనాలు ఒక వైపునచెబుతూనే, మరో వైపునమారణాయుధాలతో బాహాటంగాహత్యాకాండ సాగిస్తూ ఎన్నికల్లో నిలబడే వారినిఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి?మేధావులు,ఆలోచనాపరులు, కవులు, రచయితలుదీనిపై చర్చలు జరపాలి. ప్రజలను యిందులోపాల్గొనేట్లు చేయాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X