• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిగంబరకవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయనరాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యంఅనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిదిపదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపైఆయన కలం నిప్పులు కక్కుతుంది.

By Super
|

శాసనసభజరుగుతున్న తీరు, పెద్దలువ్యవహరిస్తున్న తీరు, తిట్లుశాపనార్థాలూ, భగభగ మంటలు, కలహానికికాలుదువ్వే పదాలు, కాలహరణం,ప్రజాధన దుర్వినియోగం చూస్తుంటేవింటుంటే మనం నమ్ముకున్నప్రతినిధుల స్థాయి, సంస్కారం, పరిణతి,యోగ్యతాయోగ్యతలు, సమస్యలపైఅవగాహన లోతు ఇవన్నీ ఒక్క మెతుకుపట్టుకుంటే తెలిసిపోతుంటాయి.సిద్ధాంత లేమి వల్ల జరుగుతున్న యాచీకట్లో చిందులాటలు, అలాగే ప్రజలకు యా ఎన్నికలజాతరలో, నకిలీ ప్రజాస్వామ్యంలో మరోదారి లేని దురవస్థ, నిస్సహాయతకొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇది ప్రజలసమస్యల పరిష్కారానికి ఉద్దేశించినశాసనసభా, లేక రణరంగామా?బయటఒక పక్క పగల సెగల రాజకీయహత్యలు, మరో పక్క మెతుకుదొరక్క సామాన్యుల ఆత్మహత్యలు. వీటితక్షణ నివారణ కొరకై శోధన మాని,నీచస్థాయిలో ప్రసంగించడం,ప్రవర్తించడం ఎనుకున్న ప్రజలనేఅవహేళన చేయడం కాదా?ఇంకాఇలాగే జరుగుతూ పోవలిసిందేనా? దీనికిఅంతం లేదా? ప్రజలు ఒక ఎన్నిక నుండిమరో ఎన్నిక కోసం ఎదురుచూసిప్రభుత్వాలు మార్చి తిరిగి తిరిగి పెరిగిపోతున్నబాధలకు ఆహుతి కావలసిందేనా? ఏ పార్టీఅయినా అన్నీ ఒకే తానులోని ముక్కలేఅనుకుంటూ కర్మ సిద్ధాంతం నీడలోకివెళ్లిపోవలసిందేనా?పార్టీఏదైనా, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులయోగ్యతలు కచ్చితంగానిర్ణయించినంత కాలం; గెలిచి వచ్చినప్రతినిధులు నిర్వర్తించవలసినవిధులేమిటో నిర్దేశించనంతవరకూ;రాజకీయాలకూ వ్యాపారాలకూ మధ్యగలసంబంధాన్ని వేరుచెయ్యనంతవరకూ; రాజకీయాల్లోసత్ప్రవర్తనలో ఏ మాత్రం తేడాకనిపించినా సమాజ బహిష్కారం లేకకులమున్నంత వరకు కులబహిష్కారం అమలుచేయనంతవరకూ; హత్యలూ, అవినీతియింకా పెరిగిపోతూనే వుంటాయి. ప్రజలుప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే పరిస్థితికొనసాగుతూనే వుంటుంది. ఈదుర్మార్గపు దారిలో ప్రజలకు శాసనాల మీదపూర్తిగా నమ్మకం పోతుంది. దానికిమరో పేరు అల్లకల్లోలం. దాని అంచుల్లోనేమనమిప్పుడు బతుకుతున్నాం. మనరాజకీయ నాయకులు నేటి పరిస్థితుల్లో,వ్యవస్థల్లో ఎటువంటి మార్పునీకోరుకోరు. అంతేకాదు, వారు మార్పునితీవ్రంగా అడ్డుకుంటారు. ఎందుకంటేమనమాశించే మార్పుల వల్ల వారిరాజకీయ వ్యాపారాలు దెబ్బ తింటాయి.ఆదాయం తగ్గిపోతుంది. ప్రజలపై ఆధిపత్యంతగ్గిపోతుంది. అది వాళ్లు సహించలేరు.అందుకే వాళ్లు మార్పుకుఅనుగుణమైన చట్టాలు తీసుకురారు.తప్పనిసరి పరిస్థితుల్లోసంస్కరణవాదులుగా ఫోజు కొట్టి ఒకటీ అరాతీసుకువచ్చినా అవి ఆచరణలో విఫలమయ్యేట్లుచూస్తారు.ఇటువంటిదుర్భర అమానవీయ క్రూర నిస్సహాయస్థితిని సమూలంగా మార్చడానికి, ఎన్నికలకుసమాంతరంగా మరో బహిరంగమార్గాన్ని, ప్రజలంతా పాల్గొనగలిగిన పంథానిఅనుసరించక తప్పదనుకుంటాను.మన ప్రజలు సహనశీలురు. కదంతొక్కుతూ కదిలి వొచ్చేవారు. వారినేఆయుధాలుగా మార్చుకుని, వారుప్రత్యక్షంగా, బహిరంగంగాపాల్గొనగలిగిన ప్రత్యామ్నాయ పంథానుచేపట్టడం నేటి అవసరం.మరి,ఆ సమాంతర, ప్రత్యామ్నాయ పంథాఏమిటి? అది ఏ ఒక్కరి ఆలోచనలోంచి వూడిపడేదికాదు. అనేక మంది అనుభవజ్ఞులు, మనమధ్య వున్నారు. వారి అనుభవం,నిపుణత, సేవాభావం మనంతీసుకోవచ్చు. వారు తమ మనసులోవున్న ప్రత్యామ్నాయాలు వివిధ ప్రసారమాధ్యమాల ద్వారా ముందుకు తీసుకురావచ్చు. తద్వారా వారు నూతనసమాజ నిర్మాణానికి బలంగాతోడ్పడవచ్చు.ఆక్రమంలో నాందిగా నా ప్రత్యామ్నాయంమనవి చేస్తాను. ముందు యాప్రయోగం మన రాష్ట్రం మొదలుపెడితే బావుంటుంది.మొదటకులాలకీ, మతాలకీ, ప్రాంతాలకీ,రాజకీయ పార్టీలకీ, వాటి సిద్ధాంతాలకీఅతీతమైన ఆలోచనలు గల పెద్దలతో ఒకకార్యాచరణ సమితి ఏర్పడాలి. వారుమన రాష్ట్రంలోని ప్రజలు ఎక్కడెక్కడఎటువంటి సమస్యలతోబాధపడుతున్నారో నేరుగా, పత్రికలద్వారా, యితర మార్గాల ద్వారావివరాలు సేకరించి, క్రోడీకరించాలి.తరువాత, వాటికి చెందిన రంగాల్లోనినిపుణులతో ఒక సభను ఏర్పాటు చేయాలి. ఇదినిపుణుల సభ శాసనసభకుసమాంతరమైంది. శాసనసభలోపార్టీలకు తప్ప నిపుణుల వాణికిప్రాధాన్యత లేదు. నిపుణుల సభఏర్పాటుకు కొన్ని మేధావులనియోజకవర్గాలను ఏర్పాటు చేసుకొని,తద్వారా వారిని ఎన్నుకోవచ్చు. ఈ నిపుణులుసమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆసమావేశాల్లో ఆయా సమస్యలకుసాంకేతికమైన పరిష్కారం సూచిస్తారు.వాటిపై తీర్మానాలు చేస్తారు. ఇవి చట్టాలకుసమాంతరం. వాటి అమలుకుప్రభుత్వంపై, ఆయా శాఖలపై తీవ్రమైనఒత్తిడి తీసుకు రావడానికి ప్రజలనుఉద్యమ రూపంలో వుత్తేజపరుస్తారు.తమ పరిధిలోని పనులను తామేచేపట్టి చేసుకోవడానికి ప్రజలనువుత్సాహపరుస్తారు. ఈ నిపుణులసభ ప్రజావాణిని వినిపిస్తుంది. అన్నవ్యవస్థలూ పని చేయడానికివుద్దేశిస్తుంది. ప్రస్తుతంమనమున్నది నిపుణుల యుగంలో.నైపుణ్యం లేని వారు ఏ పనినీప్రయోజనకరంగా చెయ్యలేరు.శిక్షణ, క్రమశిక్షణ, నైపుణ్యం,స్పష్టమైన పంథా లేని ప్రయాణంఎక్కడికీ తీసికెళ్లలేదు.సత్ఫలితాలివ్వలేదు.నిపుణులసభ - సాధారణ ఎన్నికలనియమావళిలోని ఏ అంశాలు వుండాలోముసాయిదా తయారు చేస్తుంది.అభ్యర్థుల యోగ్యతలు నిర్ణయిస్తుంది. ఏనియోజకవర్గంలో ఏ సమస్యలున్నాయోవాటిపై సమర్థంగా పనిచెయ్యడానికి ఏఅభ్యర్థి ఎన్నికయితే బావుంటుందోపార్టీలకతీతంగా సూచిస్తుంది. ఇలా అన్నిరంగాల్లోని అంశాలపై యా నిపుణుల సభపని చేస్తుంది. దీని నిర్వహణ అతి తక్కువఖర్చుతో జరుగుతుంది. ఇది ఓ నమూనామాత్రమే. ఆచరణాత్మకమైనవివరాలన్నీ క్రమంగా ఏర్పాటుచేసుకోవచ్చు.సమస్య- పరిష్కారం - ప్రజలను సృజనకారులుచెయ్యడం - నిపుణులు - వీటితో యానమూనా వుంటుంది. ఇప్పుడు మనరాజకీయాల్లో నైపుణ్య ప్రస్తావనలేకపోవడం వల్లనే అడ్డదిడ్డంగాతయారైంది. స్వార్థప్రయోజనాలుపతాకస్థాయికి చేరడం వల్లప్రజాసేవ పేర హత్యాకాండజరుగుతున్నది. దీనిని ఎక్కడో ఒక చోటఆపవలసి వుంది. అందుకనేసమాంతర ప్రత్యామ్నాయం గురించినఆలోచన.ఈనమూనాను కొందరు ఊహాజనిత కల్పనానమూనాగా (యుటోపియాగా) కొట్టివేయవచ్చు. అందులో తప్పేం లేదు.ఇప్పుడు అమల్లో వున్నవన్నీ కొంచెంతేడాల్తో యుటోపియాలే. మరొకదాని గురించిఆలోచించడంలో తప్పేంలేదనుకుంటాను.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Information about telugu Features and telugu politics along with telugu coloumns
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more