వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగంబరకవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయనరాసిన కొయ్యగుర్రందీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది.నగ్నమునిది పదును దేరిన కలం.సమాజంలోని వికృతాలపై ఆయన కలంనిప్పులు కక్కుతుంది.

By Super
|
Google Oneindia TeluguNews

ప్రకృతిప్రవృత్తి అనంత చైతన్యం.అనుక్షణం తొణికిసలాడే ఆదిలోనిమూలకారణాలు సైతం వెదజల్లేకిరణాలతో సంభవించే విభ్రమయఝంఝా మారుతం మరుక్షణంప్రచండం. కలగలసి నిత్యం ప్రదర్శించేజీవనహేల. అక్కడ మరణంపునఃసృష్టికి పునాది. అక్కడిదృశ్యాదృశ్య వ్యవస్థలన్నీ బహుశక్తివంతమైనవి. అద్భుతజవజీవాలతో నిండి సర్వసమానత్వవీక్షణతో పొంగిపొర్లుతూ వుండేవి.సర్వం కదిలించేవి. అంధకారానికి అర్థంచేప్పేవి. వెలుగును కుమ్మరించేవి.దర్శనం నిమిత్తం నిజనేత్రాలుఇవ్వడానికి తహతహలాడేవి.ఎల్లప్పుడూ మానవుడికి యివ్వడానకిసంసిద్ధమయ్యేవి. ప్రకృతి ప్రదాత.క్రమ భ్రమణంలోంచి సక్రియాప్రవర్తనకు మార్గం చేపేది. అందుకేప్రకృతి మనకు అమ్మ వంటిది. అన్నివ్యవస్థలకూ ఆత్మలాంటిది. అర్థంచేసుకుంటే అనర్థాలు దరిచేరలేనిది.మావనప్రకృతి విచిత్రమైనది. విరుద్ధమైంది.వికృతమైంది. ఒక పక్కన ప్రకృతిఅంతరంతరాలు శోధిస్తూ నడిచే శాస్త్రవిజ్ఞాన సముపార్జనా హేతుమార్గంలోఏర్పడే సమకూడే నాగరికతఫలితాలను బహుభిన్న కోణాల జీవితానికిఅన్వయించుకుంటూ అభివృద్ధిని,అభ్యుదయాన్ని సాధించడం పోయిసమాంతరంగా స్వీయ ధ్వంసంచేయగల ఆలోచనలను ఆవిష్కరిస్తూపోవడం విచిత్రాల కల్లా విచిత్రం. వెలుగుకోసం వెంపర్లాడటం మానిఅంధకారంలోనే బతకడానికిఆతృతపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈజీవన దీర్ఘ ప్రయాణంలో ఎందరెందరోమనీషులు దారిలో దీపాలు వెలిగిస్తూవెడుతున్నా, వాటిని వెనువెంటనేఆర్పడానికి యినపరెక్కలువిసురుతున్నారు ఆ మావవులు.వారు అవినీతి చీకట్లో బతుకుతారు.విలువలను ద్వేషిస్తారు. అమానవీయలోకాన్ని సృష్టించడానికే నిత్యంప్రయత్నిస్తుంటారు.ఈమానవలోకంలో వస్తుసముదాయమేకాదు, అతి సున్నిత జలదరింపుల భావనలనుండి తీవ్రాతి తీవ్ర జీవన కాంక్షలవరకూ అన్నీ క్రమంగా మాసిపోతాయి.జీర్ణమవుతాయి. వాటిని జాగ్రత్తగాపోషించుకోకపోతే,సంరక్షించుకోకపోతేత్వరత్వరగా మసకబారిమాసిపోతాయి. తుప్పు పడతాయి.శిథిలమవుతాయి. వాటి వునికేఅదృశ్యంలోకి జారిపోతుంది.ప్రేమికులమధ్య, వ్యక్తుల మధ్య స్నేహంతోసంబంధ బాంధవ్యాలతోమలయమారుతంలా ప్రవేశించే ప్రేమ,అనురాగం, అభిమానం, ఆదరం ప్రతిక్షణం కాపాడుకోకపోతే,అర్థవంతంగా తేజస్సుతో కాపలాకాయకపోతే, చూపుల బాహువులతోకాపాడుకోకపోతే అన్నీ ఎండుటాకుల్లారాలిపోతాయి. ముఖ్యంగా ప్రేమ త్వరగామాసిపోతుంది. నిర్లక్ష్యం, అలవాటుపడిన యాంత్రిక చూపుల్లో చేతల్లోపడినలిగి మొద్దుబారి తుప్పు పట్టిశిథిలమవుతుంది. కలిసి జీవిస్తున్న మాజీప్రేమకులుగా, మాజీ మిత్రులుగా, ఉత్తిసహచరులుగా మిగిలిపోతారు. ధరించినస్పందనలు, ప్రతిస్పందనలనే వస్త్రాలుచినిగి పీలికలవుతాయి. పాతబట్టలుకొనేవాడెప్పుడో వచ్చినప్పుడు వాడికితపేళాకో, చెంబులకో అమ్మేస్తారు.ప్రేమికుడు,ప్రేమించబడడం కష్టమైనదీ,క్లిష్టమైనదీ ప్రేమ అనే పేరుతోకాంక్ష అనేక రూపాల్లో సంచరిస్తూవుంటుంది. ప్రేమ ఒక అద్వితీయమైనశక్తి. అపురూపమైన పక్షి. పంజరంలోపెట్టలేనిది. మచ్చికకు రానిది. తీరాలకుఎగిరిపోతుంది. కవిత్వమైనా, ఎటువంటిసృజనాత్మక రచన అయినా ఆ పక్షే.మానవీయ విలువలన్నిటికీ ప్రతిరూపమే ఆపక్షి.దీనితోపాటు వికృతి గురించి కూడా చెప్పాలి. కుహనావ్యవస్థలతో, కుహనా విలువలతోనిండిన ఈ కుహనా సమాజంలో కుహనాప్రేమ కూడా వర్ధిల్లుతోంది. ఒక పురుషజంతువు ప్రేమ అనే మాస్క్‌తగిలించుకుని ఓ స్త్రీ వెంటపడితే, ఆఅమాయక ప్రాణి సున్నితంగాతిరస్కరిస్తే, దీనిని అవమానంగా భావించి ఆరెండు కాళ్ల జంతువు పొంచి ఉండిహఠాత్తుగా, బలవంతంగా,భయంకరంగా, భౌతికంగా,దౌర్జన్యంగా ఆక్రమించుకుని తనమగ ఆధిపత్యాన్ని స్థాపించడానికి వేటకొడవళ్లతో దారుణంగా సమాజంచూస్తుండగానే నరికేస్తాడు. దీనినీప్రేమ అనే పిలుస్తాడు. తర్వాతఅరెస్టు చేస్తారు. జైల్లో పెడతారు. కేసుఏళ్లు నడుస్తుంది. నడుస్తూ వుంటుంది.దాదాపుగా అంతా మరిచిపోతూ ఉంటారు.ఇవతల యింటువంటి మాస్క్‌ ప్రేమికులఫ్యాక్టరీలో చాలా నరజంతువులుతయారవుతూనే వుంటాయి. వాళ్లుసమాజ అభయారణ్యంలో ప్రవేశిస్తూనేవుంటారు. ఈ జంతువులు జింకలపైలంఘిస్తూనే వుంటాయి.ప్రకృతిమనషికి యిచ్చిన వరం ప్రేమ.శతాబ్దాలు గడిచినా యింత వరకూమనిషి ప్రేమించడంనేర్వలేకపోయాడు. ఒక వేళప్రేమించాను, ప్రేమించగలను అని అనుకున్నాఅది క్షణికమే, చివరి వరకూ నిలుపుకోగలశక్తిని సంపాదించలేకపోయాడు.కబేళా కత్తులతో, అణ్వస్త్రాలతో ప్రేమనుసాధిస్తామనుకోవడం - వ్యక్తులమధ్య అయినా, దేశాల మధ్య అయినాఅదొక భ్రమ. కపటనాటకం. అతడొకలవ్‌ మాస్క్‌ తొడుక్కున్ననరభక్షకుడు. ఊహ వొచ్చినప్పటినుండి మనిషి మాట్లాడి మాట్లాడిసూక్తులు వినివిని ప్రేమ ఒక పాతబడిపోయిన మాట అయిపోయింది. యవ్వనంలోకాసేపు తాకి, కాలవేగంలో పడి వయసుమీద నుండి ఎడారి గాడ్పులాగమారిపోతుంది. ప్రేమను ప్రతి తరం తిరిగినిర్వచించుకోవాలి. మార్గాన్నినిర్దేశించుకోవాలి.ప్రకృతిలోఅన్ని వ్యవస్థలూ అర్థవంతంగావున్నాయి. మానవుడు చెయ్యవలసిందిప్రకృతిని జయించడం కాదు. అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రకృతినిఅనుసరించడంలోనే అన్ని సమస్యలకూసమాధానాలున్నాయి. ప్రకృతిని జయించామని,జయించాలని అంటూ వుంటారు. ప్రకృతినిజయించడం అన్నది ఆధిపత్యానికి చెందినభాష. ఆ ధోరణితో నూత్న సమజాం,రాజ్య, మానవ సంబంధాలు ఏర్పడవు.నయా యజమానులు - బానిసలు వస్తూనేవుంటారు.ఒకప్పుడుమానవుడు ప్రకృతిని ఆరాధించాడు.ఇప్పుడు చెయ్యవలసింది అర్థంచేసుకోవడం, అనుసరించడం. అప్పుడేనూత్న వ్యవస్థలు నిర్మితమవుతాయి.ప్రకృతి వర్ణక్రమంలో మొదటిదిప్రేమించడం, అందులోని భాగమేపర్యావరణం, అందులోనే మొలకెత్తేమావనసంబంధాలు.

English summary
Information about telugu Features and telugu politics along with telugu coloumns
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X