చుక్కాని లేనినావలో ప్రయాణం

గతకొద్ది దశాబ్దాలుగా ప్రపంచ రాజకీయాలలోనూ, ఆర్థిక రంగంలోనూఅమెరికా పతన దిశగా పయనిస్తోందనేఅభిప్రాయాన్ని పలువురు అమెరికా రాజకీయ నాయకులు, అత్యున్నతస్థానాల్లో ఉన్నవారు వెలిబుచ్చుతున్నారు. వియత్నాంయుద్ధంలో పరాజయం వంటి ఘటనలు ఈఅభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయి. కాగా, కార్టర్‌అధ్యక్ష కాలంలో జరిగిన అమెరికా తిరోగమనాన్నితాను తిరగ రాయగలననే అజెండాతోనే 1980లలో రోనాల్డ్‌రీగన్‌ అమెరికా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నాడు.లిబియాపై విమాన దాడులు (1986), గ్రనడా ఆక్రమణవంటి ప్రపంచ పోలీసు పెత్తనం చేసే వ్యవహారాల ద్వారాఅమెరికా తిరిగి తాను కోల్పోయిన ఆధిపత్యాన్నిసంపాదించుకుంటుందనే భ్రమను రీగన్‌ కల్పించాడు. అయితేరీగన్‌ వాదనలను అమెరికా డెమోక్రాట్లు తమప్రతివాదనల ద్వారా తిప్పి కొడుతూ వచ్చారు. అమెరికా ఆధిపత్య పతనం కొనసాగుతూనేవుందనేది అప్పుడు డెమోక్రాట్ల అభిప్రాయం.దానికి తార్కాణాలుగా వారు పెరిగిపోతున్న విదేశీ రుణభారాన్ని, డాలర్‌ఎదుర్కుంటున్న సంక్షోభాన్ని ఎత్తి చూపుతూ వచ్చారు.

1991లో సోవియట్‌యూనియన్‌ పతనంతో అమెరికా ప్రజల దృష్టి మరింతగా తమదేశ అంతర్గత ఆర్థిక బలహీనతల వైపుమళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇరాక్‌పై అమెరికాయుద్ధాన్ని ప్రకటించింది. అయితే యుద్ధంలోవిజయం తాలూకు ఫలితాలు అమెరికా ప్రజలనుదీర్ఘ కాలంపాటు మభ్య పెట్టలేకపోయాయి. దీంతో 1992అధ్యక్ష ఎన్నికల్లో బిల్‌ క్లింటన్‌ మళ్లీ అమెరికాబలహీనతలను బహిరంగంగా ముందుకు తెచ్చారు.అత్యాధునిక సాంకేతిక రంగ పరిశ్రమల్లో తమ ఆధిపత్యం తగ్గిపోవటాన్ని,అమెరికా కలలు కల్లలు కావటాన్ని,కుంచించుకుపోతున్న మధ్య తరగతినిక్లింటన్‌ తన వాదనలకు దాఖలాలుగా చూపారు. పరోక్షయుద్ధం ముగిసన దశలో నిజమైన విజేతలుగానిలిచింది జర్మనీ, జపాన్‌లు మాత్రమేననేదిఅమెరికా ప్రజలు మెల్లమెల్లగా గుర్తించసాగారు.

అయితే అమెరికా పతనంలోని ఆర్థికపార్శ్వాన్ని డెమోక్రాట్లు ముందుకు తెస్తుండగా,రిపబ్లికన్‌లు మాత్రం ఆ దేశపు నైతిక, సాంస్కృతిక పతనాన్ని ప్రధానాంశంగాముందుకు తెస్తున్నారు. అమెరికా పతనానికి ఆదేశపు సామాజిక, ఆర్థిక లోటుపాట్లేకారణమనేది పలువురు రిపబ్లికన్‌ల వాదన. 1960వదశకంలో అంటే, అమెరికన్లు న్యూలెఫ్ట్‌గా పేర్కొంటున్న యువతరంనుంచి వచ్చిన సాంస్కృతిక సవాళ్ల వల్లనేఅమెరికా ప్రజల్లో ముఖ్యంగా పేదలలో నైతికవిలువలు పతనమయ్యాయనేది రిపబ్లికన్‌లవాదన. కాబట్టి ఇటువంటి సోమరిపోతు పేదలకు రక్షణకల్పించే సామాజిక భద్రతా వ్యవస్థనునేలమట్టం చేయాలనేది రిపబ్లికన్‌లవాదన. అలాగే రీగన్‌ ప్రతిపాదించిన ఆర్థిక విధానాలుపని చేశాయి. కనుక పన్నులలో కోత, పలు సామాజిక బాధ్యతలనుంచి ప్రభుత్వం తప్పుకోవటం మరింతఅవసరమనేది రిపిబ్లికన్‌ల అభిప్రాయం.

అయితే, వాస్తవానికిఅమెరికా పతనానికి ఈ రెండూ (ఆర్థిక, సాంస్కృతిక) ఏదోమేరకు కారణామే. అటు రిపబ్లికన్‌లు, ఇటుడెమోక్రాట్లలోని మధ్యేవాదులు ఈ విషయాన్ని ఏదో ఒకమేరకు గుర్తిస్తూనే వున్నారు. కానీ మొత్తం మీదఅమెరికా పతనానికి సంబంధించిన కారణాల విషయంలోరిజబ్లికన్‌లు, డెమోక్రాట్ల మధ్య విభజన రేఖ కొనసాగుతూనేవుంది. కాగా, అమెరికా ప్రపంచ ఆధిపత్యానికిఆర్థికపరమైన జోక్యాలే కీలకాంశమని భావించేడెమోక్రాట్ల పరిపాలన కిందే గత ఎనిమిదిసంవత్సరాలుగా అమెరికా వుంది. ఈ నేపథ్యంలోనేఅమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్లుకనిపించింది. అయితే, ఆర్థిక వ్యవస్థలో ఈ పెరుగుదల బలుపుకాదు. కేవలం వాపు మాత్రమేననే పరిస్థితికిక్లింటన్‌ పదవీకాలపు చివరిదశలో అమెరికా స్టాక్‌మార్కెట్లో, ఆర్థిక వ్యవస్థలో తలెత్తినసంక్షోభాలే నిదర్శనం. ఈ పరిస్థితిలోనేరిపబ్లికన్‌ పార్టీ నేత జార్జి బుష్‌ అమెరికాఅధికార పగ్గాలు చేపట్టారు.

అమెరికా ప్రపంచఆధిపత్యాన్ని రుజువు చేసేందుకు యథావిధిగాఇరాక్‌పై సైనిక దాడులు జరిగాయి. మరో పక్క వీటివేటితోనూ నిమిత్తం లేనట్టుగా అమెరికా ఆర్థికవ్యవస్థ మాత్రం పతన దిశగానే సాగుతోంది. ఈ పరిస్థితిలోరిపబ్లికన్‌ల విధానాలు (అంటే, బుష్‌ విధానాలు)అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పటిష్టస్థాయిలో నిలబెట్టగలవా అనేదిప్రశ్నార్థకమే. రిపబ్లికన్‌ల ఆర్థిక విధానమైన తక్కువ ప్రభుత్వజోక్యం ఎంత మేరకు పని చేస్తుందన్నదానికి ఆదేశంలోని కాలిఫోర్నియాలో అమలు జరిగిన విద్యుత్‌ రంగపు ప్రయివేటీకరణప్రయత్నాల వైఫల్యం ఒక సవాల్‌గా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమలు జరిగిన ప్రయివేటీకరణ,గ్లోబలైజేషన్‌ విధానాలు కూడా విఫలమైనట్లుగాకనబడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక పతనాన్నిరిపబ్లికన్‌లు నిలువరిం చగలరనేది సందేహాస్పదమే.

మరో కోణం నుంచిచూస్తే అటు డెమోక్రాట్లు అధికారంలో వున్నా, ఇటురిపబ్లికన్‌లు అధికారంలో వున్నా అమెరికాపెట్టుబడిదారీ సామ్రాజ్యంలో బహుళ జాతి సంస్థల బడాపెట్టుబడిదారులదే రాజ్యం కావటం గమనార్హం.నాటి సోవియట్‌ యూనియన్‌ ఆస్తిత్వంలో ఉన్నకాలంలో ఆ దేశం ప్రచురించిన ఒక పుస్తకంలోనివివరాల ప్రకారం అమెరికాలోని ప్రతి ఒక్కసెనేటర్‌కు తమకు అనుకూలంగాతిప్పుకునేందుకు సరాసరిన పది మంది లాబీయిస్టులు(బహుళ జాతి సంస్థల తాలూకు) పని చేస్తున్నారనిఅర్థమవుతోంది. ఈ లెక్కన అమెరికాలోరిపబ్లికన్‌లు అధికారంలో వున్నారా లేరాడెమోక్రాట్లు అధికారంలో వున్నారా లేరా అన్నదిఅసలు సమస్యే కాదు.

ఈవిషయాన్ని అమెరికా ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నట్లుగా కూడాకనబడుతోంది. అంటే నిన్నా మొన్నటి వరకు భిన్నధృవాలుగా కనిపించిన రిపబ్లికన్‌లు, డెమోక్రాట్లు నేడుఒకే నాణేనికి సంబంధించిన బొమ్మాబొరుసులుగాఅమెరికా ప్రజల దృష్టిలో నిలబడుతున్నారు. అంటేఅమెరికా వ్యవస్థ నేడు కేవలం రిపబ్లికన్‌లు చెబుతున్నట్లుగాసామాజిక, సాంస్కృతిక రంగాలలోనూ లేదా డెమోక్రాట్లు చెబుతున్నట్లుగా ఆర్థికరంగంలోనూ మాత్రమే సవాళ్లనుఎదుర్కోవడం లేదు. అమెరికా రాజకీయ వ్యవస్థలోసహితం విశ్వసనీయత సమస్య బలంగా తలెత్తుతోంది.నిన్నా మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఏర్పడినతాత్కాలిక ప్రతిష్ట ఈ రాజకీయ సంక్షోభపు చిన్నమబ్బు తునక మాత్రమే.

గతంలో తమ ప్రపంచవ్యాప్త లూటీ నుంచి లభించిన మొత్తాన్ని తమదేశ ప్రజలతో ఏదో ఒక మేరకు ఆ దేశపు బహుళ జాతి సంస్థలు పంచుకుంటూవచ్చాయి. అయితే, నేడు ఈ బహుళ జాతి సంస్థలు తమ లాభాలవేటలో అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్మించుకున్న సంక్షేమవ్యవస్థను, అమెరికా ప్రజల భవిష్యత్తు తాలూకు కలలనునేలమట్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో అమెరికాఅధ్యక్ష పీఠం మీద ఏ పార్టీ కూర్చున్నదనే అంశంతో నిమిత్తం లేకుండాఅమెరికా సామాన్య ప్రజల జీవితాలు నిరవధికంగా,నిరంతరాయంగా బుగ్గి పాలు కాబోతున్నాయి.

అంటే, 30-40 ఏళ్ల క్రితంఅమెరికా అధ్యక్షునిగా వున్నవారు తమ విధాననిర్ణయంలో కలిగి వున్న స్వేచ్ఛ నేటి అమెరికాఅధ్యక్షులకు లేదు. పగ్గాలు లేని గుర్రం మీద,మరో మాటలో చెప్పాలంటే, పులి మీద స్వారీలానేటి అమెరికా అధ్యక్షుని పరిస్థితి వుంది. ఈ మొత్తంనేపథ్యంలో రానున్న నాలుగు సంవత్సరాలకాలంలో అమెరికా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో జరుగునున్నమార్పులు ఆ దేశ భవిష్యత్తును గణనీయంగా ప్రభావితంచేయనున్నాయి. అంటే, నేడు అమెరికా ప్రజలు ఒకసంధియుగంలో జీవిస్తున్నారు. చుక్కాని లేని నావలా ఈప్రయాణం సాగుతోంది. దీనంతటి ఫలితం మొత్తంప్రపంచంపై ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

[email protected]

ఆర్థిక, సామాజిక రంగాల అవినాభావ సంబంధాన్నివిశ్లేషించడంలో డి. పాపారావుది అందె వేసినచేయి. ప్రపంచ మార్గం ఎటు పోతుందనే జిజ్ఞాసఆయన వ్యాసాలకు ముడిసరుకు. పాపారావు పలు పత్రికలకువ్యాసాలు రాస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+