వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

కాని ఈసారి అలాజరగలేదు. అమెరికా ఆర్ధికవేత్తలలోని పలువురు ఏడాదిక్రిందటే, ఇప్పటి అమెరికా ఆర్ధిక వ్యవస్థ విస్తరణ 1920సంవత్సరం నాటి పరిస్థితిని తలపింపచేస్తోంది అని ఆందోళనవ్యక్తం చేశారు. 1920లలో కూడా అమెరికా ఆర్ధికవ్యవస్థ గత కొద్ది మాసాల వరకుజరిగినట్లుగానే విస్తరించింది. ఈ విస్తరణకు సాఫ్ట్‌వేర్‌,ఇంటర్‌నెట్‌, టెలికామ్‌ రంగాలు ప్రధానమైనపునాదిగా వున్నాయి.

1920వ దశకంలోనిన్నమొన్నటిలాగే తక్కువ శాతం ద్రవ్యోల్బణంవిపరీతమైన ఉత్పాదకతలతో విస్తరించినఅమెరికా ఆర్ధిక వ్యవస్థ 1929 చివరినాటికికుప్పకూలిపోయింది. నాడు ఈ సంక్షోభంలోకి అమెరికాతో పాటుగా పలు ఇతరదేశాలు కూడా లాగివేయబడ్డాయి. అందుచేతనేదీనిని యావత్‌ప్రపంచం గ్రేట్‌ డిప్రెషన్‌గాగుర్తుంచుకొంటుంది. గత కొద్ది మాసాలవరకూఅమెరికా ఆర్ధిక వ్యవస్థ, నాటి డిప్రెషన్‌ పరిస్థితులనే పోలిన అత్యంత తక్కువద్రవ్యోల్బణం, హెచ్చు ఉత్పాదకతలతో అభివృద్ధిచెందింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆర్ధిక పరిస్థితి 1920లనాటి పరిస్థితినే పోలి ఉండడం గమనార్హం.

ఇక ఇప్పుడు అమెరికాలో గతకొద్దినెలలుగా పెరుగుతున్న నిరుద్యోగం, కుప్పకూలుతున్నస్టాక్‌మార్కెట్‌లు, తగ్గుతున్న వినియోగదారుల కొనుగోళ్ళుమొదలైన వాటితో ఆర్ధికమాంద్యం వైపుగాఅడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది. కాగా ఇప్పుడుఅలన్‌గ్రీన్‌స్పాన్‌ నాయకత్వంలోని అమెరికాఫెడరల్‌ బ్యాంకు, ఈ ఉపద్రవం నుంచిగట్టెక్కించగలగదని అమెరికాకు చెందినరాజకీయవేత్తలు, ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అయితేమనం చరిత్రలో ఓసారి వెనుకకు తిరిగిచూస్తే 1920లో కూడావాణిజ్యరంగంలో ఒడిదుడుకులు ఎదుర్కోవడంలోఅమెరికా ఫెడరల్‌బ్యాంకు సమర్ధవంతమైనదనేవిశ్వాసం అప్పటి ఆర్ధికవేత్తలలో కూడా నేడు ఉన్నంతప్రగాఢంగానే ఉంది.

అయితే చివరకు ఆనమ్మకం వమ్ము అయింది. ఫెడరల్‌బ్యాంకు నిర్ణయాలలోనిఅనేక లోటుపాట్లు 1929లో అమెరికా షేర్‌మార్కెట్‌ పతనానికి, తద్వారాదీర్ఘకాలిక ఆర్ధికమాంద్యానికి దారితీశాయి. ఈ పరిస్థితి ఇలాఉండగా డిమాండ్‌-లాభాలు తగ్గిపోతున్నహైటెక్‌ రంగ పరిశ్రమలు తమ పెట్టుబడివ్యయ మొత్తాన్ని మరింతగా పెంచుకుంటున్నాయి. తద్వారా అవి తమ లాభాల గండినిపూడ్చుకోజూస్తున్నాయి. వాస్తవానికి ఈ హైటెక్‌ రంగ పరిశ్రమల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలావుంది. అదనపు పెట్టుబడులు పెట్టకుండా ఈ కంపెనీలు లాభసాటిగానడవలేవు. మరోప్రక్క తగ్గిపోతున్న డిమాండ్‌వలన ఆ కంపెనీలు మరింతగా నష్టాల ఊబిలోకికూరుకుపోతున్నాయి.

పై వాదనకునిదర్శనంగా, ఆదాయం తగ్గిపోవడం వలన వాటాలవిలువ పడిపోతున్న పలు హైటెక్‌ కంపెనీలనుమనం పేర్కొనవచ్చు. లాభాల వేటలో, హెచ్చుశాతంలోఅదనంగా పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఇంటెల్‌ కంపెనీఆదాయం ఈ సంవత్సరం నాల్గవ విభాగంలో పెరుగుదల లేకుండాఉండిపోయింది. ఆ కంపెనీ ఈ సంవత్సరపు చివరిమూడునెలల కాలంలో తన ఆదాయం 4 నుంచి 8 శాతంవరకు పెరుగుతుందని ఆశలు పెట్టుకుంది. మోటరోలా కంపెనీ కూడా ఇదేకాలానికి, తాము ముందు వేసుకున్న అంచనాల ప్రకారంఆదాయం ఉండబోదని చేతులెత్తేసింది. ఇకసాఫ్ట్‌వేర్‌ రంగంలో మణికిరీటం వంటి మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. అలాగే యాపిల్‌ కంప్యూటర్లు, బ్యాంక్‌ ఆఫ్‌అమెరికాలు కూడా తమ వాటాదారులకు నిరాశాజనక పరిస్థితినేచూపిస్తున్నాయి.

తమ దేశంలోనినిరుద్యోగుల సంఖ్య నివేదికల ఆధారంగా అమెరికా కంపెనీలవాటాదారులు షేర్‌మార్కెట్‌ పరిస్థితిని అంచనా వేసుకుంటారు.నవంబర్‌ మాసానికి గాను అమెరికాలోని నిరుద్యోగుల సంఖ్యకుసంబంధించిన నివేదిక కొద్దిరోజుల క్రితంవిడుదల అయింది. ఈ సంఖ్య ఏమంత ఆశాజనకంగాలేదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.అక్టోబర్‌ నెలలో 3.9 శాతంగా వున్న నిరుద్యోగ శాతం, ఇక ఇప్పుడు 4 శాతానికిపెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రభుత్వంనివేదిక ప్రకారంగానే, ఆ దేశంలో నిరుద్యోగుల సంఖ్య 1998సంవత్సరం జులై నెలనాటి అత్యున్నత స్థాయికంటే మరింత పెరిగింది. మరో గమనార్హమైనవిషయం ప్రస్తుత మాసం అమెరికాలో క్రిస్టమస్‌, నూతనసంవత్సర వేడుకల మాసం కావటం.

దీనివలన సాధారణ పరిస్థితులలోఅమెరికా వినియోగదారుల కొనుగోళ్ళు భారీగా పెరుగుతాయి. అయితేఅక్టోబర్‌ మాసపు గణాంక వివరాల ప్రకారంగాకొనుగోళ్ళకై అమెరికా వినియోగదారులు తీసుకుంటున్న రుణాలు తగ్గుముఖం పట్టినట్లుగాకనపడుతోంది. అంటే వినియోగదారులు తమవ్యయం విషయంలో జాగ్రత్తపడుతున్నారు. వివిధ కంపెనీలవాటాల విలువలు తగ్గడం, పెరుగుతోన్నఇంధనవ్యయం, వడ్డీరేట్లు ఎక్కువగా వుండడంమొదలైనవాటి అన్నింటివలన ఈ పరిస్థితిఏర్పడుతోందనేది అమెరికా ఆర్ధికవేత్తల అంచనా.

అమెరికా స్థూల జాతీయఆదాయం కూడా తగ్గింది. గత సంవత్సరం వసంతకాలంలోఇది 5 శాతంగా వుంది. ప్రస్తుతం ఈ ఆదాయం 2 - 3 శాతంగావుంది. ఈ సంవత్సరం ఆరంభంలో అమెరికా ఆర్ధికవ్యవస్థ జోరుకు కళ్ళెంవేయడం ద్వారా, 1920ల నాటి పరిస్థితిని నివారించేందుకుప్రయత్నించిన ఫెడరల్‌ బ్యాంక్‌ అధికారులు, ప్రస్తుతం ఆదేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతున్న వేగాన్నిచూసి ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనేవడ్డీరేట్లను తగ్గించడం ద్వారా అమెరికా ఆర్ధికవ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ఆ దేశ ఫెడరల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌అలన్‌ గ్రీన్‌ స్పాన్‌ ఈమేరకు ఆశలు కల్పించారు. ఆతరువాతిరోజే, అమెరికా హైటెక్‌ పరిశ్రమల స్టాక్‌మార్కెట్‌ (నాస్‌డాక్‌) 10.5 శాతం రికార్డు. అయితే ఈ పెరుగుదల తరువాతదినాలలో నిలకడగా కొనసాగలేదు. నవంబర్‌మాసం చివరిలో అమెరికా స్టాక్‌మార్కెట్‌ బారీగా నష్టపోయింది. ఈ పరిస్థితికి,ఏవిధంగా వెతికి చూసినా నికార్సైన ఆర్ధిక కారణాలుకన్పించవు. అలాగే వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన తరువాత జరిగిన భారీపెరుగుదలకు కూడా తగినంత హేతుబద్ధతలేదు. ఈరకమైన ఒడిదుడుకులతో అమెరికా ఆర్దికవ్యవస్థ, ఏ దిశగా పయనిస్తోంది అనేది పరిశీలకులకు ఆందోళనకల్గిస్తోంది. దీనితోపాటుగా అమెరికా కుటుంబాల ఆర్ధిక స్థోమతవర్తమానంలో, ఆ దేశపు స్టాక్‌మార్కెట్‌తోహెచ్చుగా ముడిపడి వుంది. 1989లో అమెరికా షేర్‌మార్కెట్‌లో 28 శాతంగా మాత్రమేవున్న ఈ కుటుంబాల వాటాలు నేడు 54 శాతానికిచేరుకున్నాయి. ఇది చాలదు అన్నట్లు అమెరికన్‌కుటుంబాలలో హెచ్చుభాగం తమ అవసరాలకై బ్యాంకులనుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాయి.అలాగే అమెరికన్‌ ప్రజలు పొదుపు చేసే మొత్తం కూడా గతంలోకంటే చాలా తగ్గింది.

వివిధకంపెనీలలో తమ వాటాల ధరలు హెచ్చుగా ఉన్నప్పుడు ప్రజలుపొదుపు చేయవల్సిన అవసరాన్ని గుర్తించరు. కాగా ఆవాటాల ధరలు తగ్గితే వారు మరల పొదుపుచేయనారంభిస్తారు. దీనితో ప్రజల వినిమయ మొత్తం భారీగా తగ్గుతుంది. ఫలితంగా వివిధ కంపెనీల సరుకులుఅమ్మకాలు కుంటుపడతాయి. దీనితో ఆర్ధిక కార్యకలాపాలుసన్నగిల్లుతాయి.

ఈ మొత్తం పరిస్థితిఒకే విషవలయంలా పని చేస్తుంది.నిన్నమొన్నటి వరకూ షేర్‌మార్కెట్‌లో పొందిన లాభాలను ప్రజలువిశృంఖలంగా ఖర్చు పెట్టారు. ఈ మొత్తం నేపథ్యంలో,నేటి గ్లోబలైజేషన్‌ యుగంలో, అమెరికా ఆర్ధిక పరిస్థితిలో ఏర్పడే ఏఒడిదుడుకులైనా మొత్తం ప్రపంచాన్ని ప్రభావితంచేస్తాయి. ఈ మొత్తం పరిస్థితి ఇలా ఉండగా, మరోప్రక్కపెట్రోలియం ధరలు పెరిగే అవకాశం పరిస్థితిని మరింత జటిలంచేస్తోంది.

మరోప్రక్క,అమెరికా ఆర్ధిక పరిస్థితి బాగా ఆశావహంగా వున్న 1999లో ఆదేశంలోకి సుమారు 700 బిలియన్ల డాలర్లవిదేశీ ధనం వచ్చి చేరింది. కాగా, ప్రస్తుతంఅమెరికాలో ఆ ఆర్ధిక అభివృద్ధి రేటు సన్నగిల్లటంప్రారంభమైన దశలో ఈ ధన ప్రవాహం ఆగిపోయే పరిస్థితికివుంది. డాలర్‌ మారకంలో కొనుగోళ్ళకు విదేశీరుణదాతలుసిద్ధంగా వున్నంతవరకు మాత్రమే అమెరికా ఆర్ధిక పరిస్థితి స్థిరంగావుంటుంది. యూరో కరెన్సీతో పోలిస్తే, గత 20 రోజులకాలంలో డాలర్‌ విలువ 5 శాతం పడిపోవడం ఇక్కడ గమనార్హం.

ఈ సంక్లిష్ట పరిస్థితిని గురించివ్యాఖ్యానిస్తూ, ఎకనామిస్ట్‌ పత్రిక చేసినవ్యాఖ్యానాలు కూడా ఇక్కడ గమనార్హం. ఆ పత్రికడిసెంబర్‌ 8 సంచిక వ్యక్తీకరించినఅభిప్రాయం ప్రకారంగా అమెరికా ఆర్ధిక పరిస్థితి సాఫీగా భూమికిదిగే అవకాశం తక్కువ. అలాగే, ఫెడరల్‌ బ్యాంకు ఛైర్మన్‌గ్రీన్‌స్పాన్‌ కల్పించిన వడ్డీరేట్ల తగ్గుదల ఆశ కూడామరిన్ని సమస్యలకు దారి తీయగలదని పలువురిఅభిప్రాయం.

వడ్డీరేట్లతగ్గుదల ఆశలో, అమెరికా షేర్‌మార్కెట్‌ ధరలుఒక్కరోజులో 10 శాతం పైగా పెరగడం ఇక్కడ గమనార్హం. అయితేవడ్డీరేట్ల తగ్గింపు అనేది, వినియోగదారులవ్యయం తగ్గితే మాత్రమే జరుగుతుంది. కాగా స్టాక్‌మార్కెట్‌ కనుకమరీ ఎక్కువగా పెరిగితే, వినియోగదారులుహెచ్చుస్థాయిలో వ్యయానికి పూనుకుంటారు.

దీనివలన వడ్డీరేట్లు అసలు తగ్గకపోగా మరింతగాపెరగవచ్చు. మరోప్రక్క పెరుగుతున్న ద్రవ్యోల్బణం వత్తిడినితట్టుకునేందుకు అభివృద్ధి రేటు తగినంత కాలంమేరకు తక్కువ స్థాయిలోనే ఉండవల్సి వుంది. రిపబ్లికన్‌ పార్టీఅధికారంలోకి రావడంతో, స్టాక్‌మార్కెట్‌ పుంజుకున్నట్లుగాకనపడుతోంది. అయితే, వివిధ అమెరికన్‌కంపెనీల, లాభాల స్వీకరణ తగ్గడం స్పష్టంగాకనపడుతోంది. దీనివలన దీర్ఘకాలప్రాతిపదికన, అమెరికా ఆర్ధిక పరిస్థితి, నిరాశాజనకంగానేవుంటుంది.

అమెరికా అర్ధికవ్యవస్థ ప్రస్తుత పరిస్థితి పెట్టుబడిదారీ ఆర్ధికవ్యవస్థకింద మార్కెట్‌ ఒడిదుడుకులు అంతరించిపోతాయి అనే ఆశనునిరాశ చేశాయి. కాగా గ్లోబలైజేషన్‌ ఈమార్కెట్‌ సంక్షోభాన్ని (మాంద్యం) నిజంగానేప్రపంచీకరించ గలదు. కాబట్టి మనదేశంవంటి దేశాలు సరళీకృఆర్ధిక విధానాలుసర్వరోగనివారిణిగా భావించరాదు. సరళీకృత ఆర్ధిక విధానాలపేరుతో అమలు జరుగుతున్న ప్రైవేటీకరణవంటి విధానాలకు స్వస్తి చెప్పాలి.ఆర్ధికవ్యవస్థపై మార్కెట్ల ప్రభావాన్నితగ్గించేందుకు, తగ్గినమేరకు ప్రభుత్వం పట్టునుపెంచాలి. ఈ విషయంలో మనం చైనా వంటిదేశాలను ఆదర్శంగా తీసుకోవాలి. తద్వారా మాత్రమేమనం ప్రపంచ ఆర్ధికవ్యవస్థలో రానున్న ఉత్పాతాలను తట్టుకొనినిలబడగలం.

ఆర్థిక, సామాజిక రంగాల అవినాభావ సంబంధాన్నివిశ్లేషించడంలో డి. పాపారావుది అందె వేసినచేయి. ప్రపంచ మార్గం ఎటు పోతుందనే జిజ్ఞాసఆయన వ్యాసాలకు ముడిసరుకు. పాపారావు పలు పత్రికలకువ్యాసాలు రాస్తుంటారు.

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X