వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

ఇ-గవర్నెన్స్‌ లేదా ఎలక్ట్రానిక్‌ పరిపాలనఅనేది నేడు విస్తృతంగా ప్రచారంలో ఉన్న మాట.అంటే ఆధునిక టెక్నాలజీ కానుకలైనకంప్యూటర్లు, ఇంటర్నెట్‌, టెలికమ్యూనికేషన్లువంటి వాటిని ఉపయోగించుకుని ప్రజలు పరిపాలనయంత్రాంగంతో తమ కార్యకలాపాలను నిర్వహించుకోగలగడం.

ఉదాహరణకు ఒక రైతు ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోనిమారుమూల గ్రామంలో ఉంటాడు. అతని భూమినిప్రజాప్రయోనార్ధం ప్రభుత్వం స్వాధీనంచేసుకుంది. అతనికి రావలసిన నష్టపరిహారంఅందలేదు. దీనికోసం అతను కొన్ని వందల కిలోమీటర్లదూరంలో ఉన్న శ్రీకాకుళం కలెక్టరేట్‌ కో, కొన్నివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌ లోనిసెక్రటేరియట్‌ కో పరుగు తీయాల్సినపనిలేదు.ఇంటర్నెట్‌ లో రెవిన్యూ శాఖ సైట్‌ లోకివెళ్ళి ఫిర్యాదు నమోదు చేసి, ఫైలు పొజిషన్‌ తెలుసుకోవచ్చు. ఈరకమైన పరిపాలనా శైలి వల్ల పాలనయంత్రాంగంలోపారదర్శకత ఏర్పడి అవినీతి, అనవసర జాప్యం తగ్గిపోతాయి. ఒక పనిచేయడానికి నిర్ధిష్ట కాలపరిమితులు ఏర్పడి,అధికార యంత్రాగం ప్రజలకు మరింత జవాబుదారీ అవుతుంది.

కానీ ఇక్కడ ఒక చిక్కు సమస్యఉంది. అది ః ఈ-గవర్నెన్స్‌ పరిధిలోకి కేవలంఅధికార యంత్రాంగాన్ని మాత్రమే తీసుకురావడానికిసంబంధించినది. చట్టసభలను,ప్రజాప్రతినిధులను ఈ-గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు మరింత జవాబుదారులుగాచేయగలమా?అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ప్రజాప్రతినిధులు చట్టసభల్లో నిర్ణయాలుచేసేటప్పుడు , ఆ నిర్ణయాలను వారు వారికి తోచిన రీతిలో కాకుండా,మెజారిటీ ప్రజల అభీష్టాలకు అనుగుణంగానడుచుకునేలా ఇ-అగవర్నెన్స్‌ చేయగలదా? ఈసందర్భంలో నాకు దరిదాపు ఒక శతాబ్దం క్రితం ఒకబ్రిటీష్‌ పార్లమెంటేరియన్‌ తన నియోజకవర్గంలోని ఒక ఓటరుకు రాసిన లేఖ గుర్తుకువస్తోంది.

ఆ ప్రజాప్రతినిధి బ్రిటీషు పార్లమెంటులో తాను తననియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో చేసినవాగ్దానానికి భిన్నంగా ఓటు చేశాడు. ఈ తీరును ప్రశ్నిస్తూఆయనకు ఒక ఓటరు లేఖ రాశాడు. దానికిప్రతిస్పందనగా ఆ పార్లమెంటేరియన్‌నిర్మొహమాటంగా జవాబునిచ్చాడు. తాను అప్పుడు గెలిచిననియోజకవర్గంలో ఓటర్లను కొని గెలిచానని ఈ విషయంబహిరంగ రహస్యమేనని పేర్కొన్నాడు. అయితే ఆ లేఖ రాసిన ఓటరుకుతెలియనిది, తనకు మాత్రమే తెలిసినదిఒకటుందని, అది తదుపరి పార్లమెంటుఎన్నికల్లో తాను మరో నియోజకవర్గాన్ని కొనుక్కోగలిగానన్నవాస్తవమని ఆయన జవాబిచ్చాడు. అంటే ఓటువేయడంతో ప్రజాప్రతినిధులకు , వారిని ఎన్నుకున్న ప్రజలకు సంబంధంతెగిపోయేలా ఉన్న రాజకీయ వ్యవస్ధ ఉన్నంత కాలంఇ-గవర్నెన్స్‌ అనేది కేవలం ఫ్యాషనబుల్‌పదంగానే మిగిలిపోతుంది.

కోటరీలు,పైరవీలు, స్వీయ సంకుచిత ప్రయోజనాలు పలుసంసర్భాల్లో ప్రజా ప్రతినిధుల నిర్ణయాలనునిర్దేశించే పరిస్ధితి ఉన్నంతకాలం ఆ ప్రజాప్రతినిధులను, వారిని ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారులుగాచేయడం అసాధ్యం. ఈ నేపధ్యంలో అటు ప్రజాప్రతినిధులకు, ఇటు ప్రజల మనోభీష్టానికి మధ్యఅధికార యంత్రాంగాన్ని బలిపీఠం ఎక్కించడానికి మాత్రమేఇ-గవర్నెన్స్‌ ఉపయోగపడగలదు. అంతే కాక స్ధానికచొరవను పెంపొందించే నెపంతో ప్రభుత్వం పలు బాధ్యతలనుంచి తప్పించుకుంటున్న నేపధ్యంలోఅధికార యంత్రాంగపు నిర్ణయాలకు ప్రాధాన్యత తగ్గిపోతున్నది. ఈ స్ధితిలోఅధికార యంత్రాగపు పరిస్ధితి కరవమంటే కప్పకుకోపం, విడవమంటే పాముకు కోపంలా తయారై తీరుతుంది.అందుచేత నిఖార్సయిన ఇ-గవర్నెన్సుకు గానుప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములనుచేయడం తప్పనిసరి.

ఆధునిక టెక్నాలజీనిఉపయోగించుకుని మెజారిటీ ప్రజల మనోభీష్టాన్ని తెలుసుకోవడం నేడుసాధ్యమే. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రతిసందర్భంలోనూ ప్రజా ప్రతినిధులు తాము చేసేనిర్ణయాలను ఏ కారణాల చేతనైనా మెజారిటీ ప్రజలఆశలు, ఆకాంక్షలకు విరుద్ధంగా చేస్తే, ఆ నిర్ణయాలతాలూకు ప్రతికూల ప్రభావం అధికార యంత్రాంగంపై పడుతుంది.

అయితే నేడున్నప్రైవేటు ఆస్ధి వ్యవస్ధలో, అలాగే కోటానుకోట్ల జనంనిరక్షరాస్యులుగా శక్తి హీనులుగా ఉన్న వున్న పరిస్ధితిలోఇ-గవర్నెన్స్‌ ను పైన పేర్కొన్న విస్తృతార్ధంలోఉపయోగించుకోగలమా? అన్నదిప్రశ్నార్ధకమే. నల్ల డబ్బు, ఎన్నికల్లో అవినీతినానాటికీ పెరిగిపోతున్న నేటి పరిస్ధితిలోప్రజాప్రతినిధుల్లో ఎంత మంది స్వీయ సంకుచితప్రయోజనాలకు, వ్యక్తిగత రహస్య ఎజెండాలకు అతీతంగాఉండగలరనేది ఆలోచించవలసిన విషయం. కాబట్టి ప్రస్తుతవ్యవస్ధలో సమూల మార్పలు జరుగకుండా ఎలక్ట్రానిక్‌ పరిపాలన మాత్రమేమన సమాజాన్ని పట్టిపీడిస్తున్న అన్ని రుగ్మతలకు పరిష్కారంకాలేదు. అందుచేత ఇ-గవర్నెన్స్‌ అనేది తప్పనిసరిగామంచి గవర్నెన్స్‌ గా ఉంటుందనే హామీలేదు.

నిన్న మొన్నటి వరకు తెహల్కా టేపులు గుట్టు రట్టు చేసిన అవినీతి భాగోతం,ప్రజాప్రతినిధుల స్ధాయిలో కూడా ఇ-గవర్నెన్స్‌ ఎంతవరకుఅమలు జరపగలం? అనే ప్రశ్నను ముందుకు తెస్తోంది.అందుచేత మన దేశాన్ని పరిపాలిస్తున్నకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇ-గవర్నెన్స్‌ పట్లనిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే అటువంటి పరిపాలనవారి స్ధాయి నుంచే ఆరంభం కావాలి. చట్టాలనుచేయడంలో, ప్రజల జీవితాలను ప్రభావితం చేసేనిర్ణయాలు చేయడంలో, స్ధానిక చొరవను,మెజారిటీ ప్రజల మనోభీష్టాన్ని అంగీకరించగలిగినప్పుడు మాత్రమేనిజమైన ఇ-గవర్నెన్స్‌ సాధ్యమవుతుంది.ఏట్లో ఉన్నప్పుడు ఓడ మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్యగా ప్రజలను చూసే ప్రజాప్రతినిధులు ఉన్నంత కాలం ఇ-గవర్నెన్స్‌ అనేదివట్టి బూటకం మాత్రమేనని మనంగుర్తించాలి.

-డి.పాపారావు

[email protected]

ఆర్థిక, సామాజిక రంగాల అవినాభావ సంబంధాన్నివిశ్లేషించడంలో డి. పాపారావుది అందె వేసినచేయి. ప్రపంచ మార్గం ఎటు పోతుందనే జిజ్ఞాసఆయన వ్యాసాలకు ముడిసరుకు. పాపారావు పలు పత్రికలకువ్యాసాలు రాస్తుంటారు.

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X