వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్రాచ్యులు: 'అపరిచితుడు' సినిమాలో చెప్పినట్లు..

By Pratap
|
Google Oneindia TeluguNews

Kompella Madhuri
అప్రాచ్యులారా...పూర్వం ఇదో తిట్టండోయ్...ఇప్పుడు దీన్నే పాష్ గా ...ఇంగ్లీష్ లో ఫారిన్ రిటర్నెడ్ , ఎన్.ఆర్.ఐ అని ముద్దుగా పిలుస్తారనుకోండి. మమ భరత ఖండం ప్రాచ్యం, అంటే తూర్పు వైపున ఉన్న దేశం. అటు వైపు వాళ్లు - అంటే, పశ్చిమ దేశాల వాళ్లు పొట్టి బట్టలు, మధిర, మత్స్య, మాంసాదులు పుచ్చుకుంటారని, మనలాంటి గొప్ప సంస్కృతి వారికి లేదని, మనకు మల్లే ఆయతనం వేద...అనలేరని, మన పెద్ద వాళ్లు మనలో శుంఠలెవరైనా ఉంటే వాళ్లని తిట్టడానికి అప్యాచ్యుడా అనే పదం ఉపయోగించేవారు.

కానీ....,బ్రిటీష్ సామ్రాజ్యం మన గడ్డపై అడుగుపెట్టి విలువైన వస్తువులను కొల్లగొట్టడమే కాక, మన సంస్కృతి సంప్రదాయాలకే పెద్ద చిల్లు పెట్టారు. అది మొదలు ప్రతి దేశం ప్రెంచ్, డచ్,పోర్చ్ గీసు, జర్మనీ, జపాన్, చైనా...ఇలా ఏ దేశమైనా మన రత్నగర్బని వాళ్ళ హక్కు భుక్తంగా భావిస్తునే ఉన్నారు. భౌతిక విషయాలు వదిలిపెడితే మన ఆత్మనీ దొంగలించేసారు. ఇప్పుడు అప్రాచ్యుడా అనేది తిట్టు కాదు. పొగడ్త, వాళ్లని అనుకరించటం, ఆ దేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుని అక్కడ వాళ్ల చేత ముఖాన ఉమ్మేయించుకుంటూ, మర్డర్స్ చేయించుకుంటూ, అక్కడే బ్రతకటం, గొప్ప ఫ్యాషన్ అయిపోయింది.

అక్కడ బ్రతకటం తప్పని నేను అనను...కానీ అసలు భారత దేశానికి ఉపయోగపడగల యువతరం అంతా...వెళ్లి ఆ దేశాలను ఉద్దరిస్తే, ఇక మన దేశం బాగుపడేదెప్పుడు....అపరిచితుడు సినిమాలో విక్రమన్ వాపోయినట్లు ఆ దేశాలన్ని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, మళ్లీ మేము ప్రపంచ పటంలో ఉన్నాము సుమీ, అంటూ సగర్వంగా తల ఎత్తుకు నిలబడ్డాయి.

కానీ ప్రపచంలో అన్ని దేశాలకు నాగరికతను పరిచయం చేసి, అణు విభజన నుంచి అణు బాంబు వరకూ తమ వేదాల్లో ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేసుకున్న భారత దేశం మటకు, అవన్ని మిగతా ప్రపచంనానికి అందించేసి, శుభ్రంగా చేతులు దులిపేసుకుని, వీలైతే కడిగేసుకుని, ఇంకా ఏమైనా మిగిలితే అంతర్గతంగా దేశాన్ని దోచుకునే పందికొక్కులకు, దొంగలకు పెద్ద కన్నంగా మారి, రత్నగర్బగా ఉన్న దేశం కాస్తా గర్బ దరిద్రంగా మారింది.

కాబట్టి...ఓ అప్రాచ్యులారా..ఇప్పటికైనా ప్రాచ్య సంస్కృతి ,నాగరికత గొప్పతనాన్ని గుర్తించి, మేల్కొని వీలైతే ప్రక్క దేశాన్ని వదిలి, మన దేశాన్ని ఉద్దరించండి.

కొంపెల్ల మాధురి(మారుతి లక్ష్మి)

English summary

 Kompella Madhuri suggests instead of Indian youth going to abroad for libelihood, they should strive for the betterment of own country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X