• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమిళనాడులో కొత్త 'విశ్వరూపం' కోసం....

By Pratap
|

విశ్వరూపం సినిమా నిషేధంపై, కమల్ హాసన్‌ను ఎలా చిక్కుల్లో పడేశారనే విషయంపై పలు అభిప్రాయాలు, విమర్శలు, తెర వెనక కథనాల నిర్మాణ ప్రయత్నాలు వస్తున్నాయి. అసలు వాస్తవం వెల్లడి కావడానికి నిజాన్ని, కల్పన నుంచి విడదీయలేని పరిస్థితి ఉంది.

ఒక దేశంగానే మనం మనలో అసహనం ఎంతగా పెరుగుతుందో ఈ సంఘటన మరో సారి తెలియజేస్తోంది. ఇటీవలి కాలంలో రచయితలు, కళాకారులు, ప్రముఖులను ఎలా లక్ష్యం చేసుకుంటూ వారి సృజనాత్మక స్వేచ్ఛను ప్రశ్నించి, విమర్శించే సంఘటనలు చాలా జరిగాయి. లౌకిక విలువలతో కూడిన ప్రజాస్వామ్య దేశానికి ఇది ఎంత మాత్రం మంచిది కాదు.

తమిళనాడు చాలా ఏళ్లుగా సైకోఫ్యాన్సీలో మనుగడ సాగిస్తూ, సినీ ప్రపంచాన్ని రాజకీయ ఆకాంక్ష నియంత్రిస్తూ అధికార చేస్తూ సాగుతోంది. కావేరీ జలవివాదం వంటి విషయాలను సినీ ప్రపంచం బలపరచడం అందులో భాగమే. ప్రముఖ, అప్రముఖ సినీ తారలు రాజకీయ నాయకులైపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా తమ కెరీర్‌లో విజయం సాధించగలరని చెప్పడానికి అత్యున్నత ఉదాహరణ. ప్రతి ఎగ్జిక్యూటివ్ కూడా సిఇవో కాగలడనే అభిప్రాయం కలిగించే వ్యవహారం ఇది. ఒక రకంగా సినీరంగానికి, రాజకీయ రంగానికి మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి.

Jayalalitha-Karunanidhi

తమిళనాడులో 1960 దశకంలో ఉనికిలోకి వచ్చిన డిఎంకె, అన్నాడియంకె హీరోలు, విలన్లు, క్యారెక్టర్ యాక్టర్లు, కమెడియన్లతో నిండిపోయాయి. తమిళనాడు సినీ రంగం కోలీవుడ్‌‌గా ప్రఖ్యాతి గాంచిన తమిళ తరాలు ఇందులో ఉన్నారు. తాము మద్దతు ఇచ్చిన పార్టీ గెలిస్తే ప్రయోజానాలు పొందడం, ఓడిపోతే వేధింపులకు గురి కావడం సర్వసాధారణపోయింది.

సినీ ప్రపంచానికి, రాజకీయాలకు మధ్య సంబంధాలకు సంబంధించిన సంక్లిష్టమైన సాలెగూడుగా దీన్ని చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ నేతలను, సినీ తారలను వెంటాడే లక్షణం దీనికి ఉంది. ఇది తమిళనాడు అభిమాన భూతకాలం కూడా అయింది. ఇది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. తమిళనాడు ఉత్తమ నటుల్లో ఒకరైన కమల్ హాసన్ ఇటువంటి వేధింపులకు గురవుతారని ఎవరూ ఊహించి ఉండరు.

నేను చెప్పదలుచుకున్నదేమిటంటే - నేను కమల్ హాసన్ అభిమానిని కాను. అతను భిన్నమైన సినిమాలు తీయడానికి ప్రయత్నించాడు - కొన్ని విజయం సాధించాయి, కొన్ని బొక్క బోర్లా పడ్డాయి. సినిమా రంగంలో అతని కృషి విశేషంగా ఉంది. నటుడు, దర్సకుడు, నిర్మాత, గాయకుడు, ఇంకా ఇంకా... - పైగా ఉత్తమ నటుడు. అమీర్ ఖాన్ మాదిరిగా కమల్ హాసన్ సినిమాలో తీయడంలో సృజనాత్మకతను, వినూత్నతను ప్రవేశపెట్టాడు. విభిన్నమైన వినోదాన్ని కమల్ హాసన్ నుంచి గత కొంత కాలంగా అభిమానులు ఆశిస్తున్నారు. ఆ ప్రయత్నమే ఆయన చేశారు. ఇలా ప్రయత్నాలు చేసిన మరో తమిళనటుడు లేడని చెప్పవచ్చు.

అటువంటి నటుడు తన చర్యల వల్ల కాకుండా వినోదం, రాజకీయాల అంతర్గత వ్యవహారాల వల్ల ఇబ్బందులకు గురయ్యాడు. రాష్ట్రానికి ఇది అతి పెద్ద సిగ్గుచేటైన విషయం. దాదాపు వంద కోట్లతో సినిమా తీయడానికి తాను సంపాదించిన సొమ్మునంతా ధారపోశాడు (మీడియా సమావేశంలో ఆయనే చెప్పారు). చాలా మంది ఆయన సహచరులు ఆయనకు అండగా నిలుచోవడం విఫలమయ్యారు. తాము కూడా లక్ష్యంగా మారుతామనే భయంతో కమల్ హాసన్‌కు దూరంగా ఉండిపోయారు. ఇది తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల పరిస్థితి.

వెనకబడిన తరగతులకు కూడా సమాన మానవ హక్కులు సాధించేందుకు సమానత్వం కోసం దశాబ్దాల క్రితం ఇవి రామస్వామి (పెరియార్‌గా ప్రసిద్ధి) ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమిళనాడు రాజకీయాలకు ఓ రూపాన్ని ఇచ్చిన చారిత్రక సంఘటనలను తమిళ చరిత్రలో లిఖించాల్సిన అవసరం ఉంది. విపరీత వేధింపు చర్యలను, వెంటాడి వేధించే పద్థతిని, హింసించే చర్యలను నిలువరించడానికి ప్రభుత్వానికి, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. తమ ఆత్మగౌరవం కోసం తమిళ పౌరులు ప్రతిన చేయాల్సిన సరైన సమయం ఇదే. మరో విప్లవోద్యమం ద్వారా తమిళనాడు దేశానికి దారి చూపాల్సిన అవసరం తమిళ ప్రజలకు ఏర్పడింది.

- రాధా రాధాకృష్ణన్

(రచయిత బెంగళూర్‌లోని కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్స్)

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There are several opinions, criticisms and attempts to construct the ‘behind the scene’ stories on the ban on Viswaroopam and why Kamal Hassan was cornered in this fashion. It may be difficult to separate fact from fiction for the ‘real truth’ to emerge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more