Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహా శివరాత్రి రుద్రాభిషేకంలో చేయకూడని తప్పులు- వినియోగించాల్సిన వస్తువులు

రేపు.. మహా శివరాత్రి. ఈ పర్వదినం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ కూడా ముస్తాబు అయ్యాయి. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం, ద్రాక్షారామం, వేములవాడ, కాళేశ్వరం.. వంటి ప్రఖ్యాత దేవాలయాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. వేలాదిమంది భక్తులు శివపార్వతులను దర్శించుకోనున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టారు.

శివపూజలు, రాత్రంతా జాగరణ, ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా శివనుగ్రహం పొందవచ్చు. ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిందని కొందరు, శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని మరికొందరు నమ్ముతారు. శివుడు అభిషేకప్రియుడు. అందుకే శివారాధనలో అభిషేకాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

Maha Shivaratri Rituals And Rudra Abhishek Beliefs For Peace And Prosperity of Lord Maheswara

శివునికి జలాభిషేకం, క్షీరాభిషేకం తో పాటు, పెరుగుతో అభిషేకం చేయడం విశేషం. పెరుగులోని చల్లదనం శివలింగాన్ని శాంతపరుస్తుందని నమ్మకం. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, అనేక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. నల్ల నువ్వులతో శివుడికి అభిషేకం చేయడం వల్ల దుష్టశక్తుల ప్రభావం, దిష్టి నుండి రక్షణ లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇది తాంత్రిక అడ్డంకులను తొలగిస్తుందని చెబుతారు.

మాంత్రిక ప్రభావాలకు గురైన వారు మహాశివరాత్రి రోజున నల్ల నువ్వుల అభిషేకం చేస్తే అవి తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం వల్ల వైవాహిక సమస్యలు తొలగిపోయి, భార్యాభర్తల మధ్య ఆనందం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. సంతోషమైన దాంపత్యం కోసం తేనెను, సంతాన భాగ్యం కోసం నెయ్యిని శివలింగానికి సమర్పించడం శ్రేయస్కరం.

శివునికి ఒక కుండ నీటిని సమర్పించడం మన సమస్యలన్నింటినీ అంతం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ జలాభిషేకంతో శివుడు ప్రసన్నుడై భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. మహాశివరాత్రి రోజున శివుడికి జలాభిషేకం చేసిన తర్వాత, శివలింగానికి పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని చేకూరుస్తుందని నమ్మకం. మహాశివరాత్రి అభిషేకాలు పూర్తయ్యాక, శివుడికి సమర్పించిన బిల్వ పత్రాలను ఇంటికి తెచ్చుకుని ధనం దాచే స్థలంలో లేదా పర్సులో పెట్టుకోవడం శుభప్రదం.

పార్వతీ దేవికి సమర్పించిన గాజులు, గోరింటాకు, కుంకుమను ఇంటికి తెచ్చుకొని స్వయంగా ధరించాలి. ఇది నిరంతర అదృష్టాన్ని, భర్తకు దీర్ఘాయుష్షును ఇస్తుందని విశ్వాసం. శివునికి సమర్పించిన అభిషేక జలంలో కొంత భాగాన్ని ఇంటిలోని ప్రతి మూలలో చల్లితే, ప్రతికూల శక్తులు నశించిపోతాయి. అలాగే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ఈ నీటిని చల్లడం ద్వారా వారి ఇబ్బందులు పరిష్కారమవుతాయని భక్తులు విశ్వసిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+