అభిప్రాయం:‘తెలివైన’ తెలంగాణ బిల్లు

Sridhar Dharmasanam
ఎట్టకేలకు తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరిందికదా అని సంతోషపడదాం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అందులో పొందుపరచిన అంశాలను చూస్తే మటుకు కళ్ళముందు భవిష్యత్తు ఇట్లే సాక్షాత్కరిస్తుంది. ఇందుకోసమేనా దాదాపు 1300 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంది? ఇందుకోసమేనా 400 మంది విద్యార్దులు వలసపాలకుల తూటాలకుగుందెలెదురిచ్చింది? అని ఆ డ్రాఫ్ట్‌ బిల్లు చదివిన వారికెవరికైనా అనిపించకమానదు. కాని అర్ధం కాని అంశం ఏమంటే సీమాంద్ర రాజకీయ నాయకులు ఇంత యాగి ఎందుకు చేస్తున్నట్టు? వారు దానిని బహుశా చదివుండక పోవచ్చు. ఒకవేళ తీరిగ్గా చదువుతే గనుక రేపటి నుండి వారు సమైక్య ఉద్యమాలు మానుకుంటారు. అదే నేనే గనుక సీమాంద్ర బిడ్డనైతే వెంటనే ఆ బిల్లుని ఆమోదిస్తాను. కారణం అది ఆసాంతం సమైక్యవాదులు కోరుతున్నట్టుగానే రచించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లే చేస్తూ సమైక్యవాదులు కోరుతున్నట్లుగా హైదరాబాదును ఉమ్మడి రాజధాని బదులు కామన్‌ క్యాపిటల్‌గా పేర్కొన్నారు. అందునా శాంతి భద్రతల అంశాన్ని పేర్కొంటూ పార్ట్‌2 ఛాప్టర్‌8 లో విచక్షణ పేరుతో గవర్నర్‌ కు సర్వాధికారాలు కట్టబెట్టడం జరిగింది. అంతేకాదు ఆయనగారి విచక్షణాధికారాన్ని ఏ రాజ్యాంగ వ్యవస్థ కూడా ప్రశ్నించజాలదని సెలవిచ్చారు. తెలంగాణ వాదులు రేపు హైదరాబాదులో సీమాంద్రులపై దాడులు చేస్తారని కళ్ళకు కట్టినట్లుగా కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఊహించి ఇక్కడ వారి ధన, మాన, ప్రాణాలకంటే వారు హైదరాబాదులో కూడబెట్టుకున్న ఆస్తులను కాపాడాలనే కృత నిశ్చయంతో తయారుచేసినట్లుగా ఉంది బిల్లు. ఇదంతా ఒక ఎతైతే రేపు ఆంద్రప్రదేశ్‌రాష్ట్ర ప్రభుత్వానికి కావలసిన భవనాలను మరి ఇతర వ్యవస్థలను సమకూర్చటానికి తీసుకోవలసిన నిర్ణయాలు సైతం గవర్నర్‌కి అప్పజెప్పటం కేవలం తెలంగాణ నాయకత్వాన్ని, ప్రజల ను కించపరచటమే తప్పితే మరొకటి కాదు.

అంతేకాదు ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌లాంటి ప్రత్యేక పోలీసు దళాల శిక్షణా శిబిరాలను సైతం కామన్‌ క్యాపిటల్‌లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించ డం అదికూడా రెండూ ఇకే దగ్గరినుండి పనిచేయాలనడం ఇద్దరికీ ఇబ్బందికరమే. ఈ రెండుశాఖలల్లో నియామాకాలు ఏ ప్రాతిపదికన చేపడతారనేది విశదీకరించనప్పటికి అర్దం చేసుకోవలసిన అంశం ఏమిటంటే రెండు ప్రభుత్వాలు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంద్ర ప్రభుత్వం చేపట్టబోయో నియామాకాలల్లో సీమాంద్రులే ఎక్కువ శాతం తిరిగి లాభపడతారు. కారణం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో నివసిస్తున్న సీమాంద్రులు సైతం తెలంగాణ కోటాలో ఆర్టికల్‌ 371 (డి) ప్రకారం తిరిగి ఉద్యోగాలు సంపొంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఈ ఒక్క శాఖకే కాదు అన్ని శాఖలల్లో రేపు ఇదే పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది. తద్వారా స్థానికత సమస్య తిరిగి పునరావృత్తమయ్యో అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి మరో ముల్కీ చట్టాన్ని ప్రవేశపెట్టాల్సి వస్తుందేమోననే అనుమానం కలుగు తోంది. దీనిని బట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వలన హైదరాబాదులో తమకు ఉద్యోగ అవకాశాలు ఉండవని సీమాంద్ర యువతలేవనెత్తుత్ను ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం ఈ విధంగా పరి ష్కారం చూపిందని భావించవలసివస్తుంది.

ఇక పార్ట్‌4 సెక్షన్‌30 (ఏ) ప్రకారం ఇరు రాష్ట్రాలకి కలిపి ప్రస్తుతం ఉన్న హైకోర్టు కామన్‌ హైకోర్టుగా పనిచేస్తుంది. కాని విచిత్రమేమిటంటే ప్రస్తుత హైకోర్టుని ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టుగా పరిగణిస్తే తెలంగాణ హైకోర్టుని మటుకు ‘హైకోర్ట్‌ ఎట్‌ హైదరాబాద్‌గా వ్యవహరిస్తారట! రెండిరటికి న్యాయమూర్తులు కామనేనట. ఇదంతా ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ హైకోర్టును అక్కడ ఏర్పాటు చేసుకునేంతవరకేనట. కాని ఎంత సమయంలో ఏర్పాటుచేసుకోవాలో ఎక్కడా పేర్కొనలేదు. మరి దీని మర్మం ఏమిటో ఏలినవారికే తెలవాలి.

ఇక ఉన్నత విద్యావిషయానికొస్తే సీమాంద్రులకి నాణ్యతగల విద్యనందించడానికి పార్ట్‌2 సెక్షన్‌95 ప్రకారం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు అని తేడా లేకుండా అన్ని విద్యా సంస్థల్లో సమాన అవకాశాలు కల్పించబడ్డాయి. ఇప్పుడున్న యధాస్థితి రాబోయోపది సంవత్సరాలకి కూడా కొనసాగుతుందన్నమాట. తెలంగాణ ప్రాంతంలో నేటి వరకు అప్రతిహతంగా విద్యావ్యాపారం కొనసాగించిన సీమాంద్ర దిగ్గజాలకి ఇక ఎదురేమున్నది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పబడ్డ విద్యాసంస్థల్లో అత్యధికం సీమాంద్రులదే. వీరంతా ఇక్కడ 1956కి ముందున్న నృపతుంగ, వివేక వర్ధిని, బద్రుకా, లిటిల్‌ ఫ్లవర్‌, గ్రామర్‌ స్కూల్‌లాంటి అనేక విద్యా సంస్థలను పక్కకు నెట్టి తమ ప్రాంతానికి చెందిన సంస్థలను మటుకు విస్తరించారు. గత ప్రభుత్వాలు కూడా వీరినే ప్రోత్సహిస్తూ ఇక్కడి ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసాయి. ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో విద్య వ్యాపారంగా మారి ఇక్కడి సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా పోయింది. తల్లిదండ్రులు కూడా గత్యంతరం లేక వీరుఅడిగినంత సమర్పించుకుంటూ వస్తున్నారు. దీనితో రెచ్చిపోయిన సీమాంద్రులు తమ వ్యాపారాన్ని కేవలంపాఠశాల విద్యకే పరిమితం చేయకుండా ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌,డెంటల్‌, ఫార్మా రంగాలకు కూడా విస్తరించారు. ఇక డబుల్‌ ఐఐటి, ట్రిఫుల్‌ ఐటి, ఐఐటీల పేరు మీదైతే లక్షలు దండుకుంటున్నారు. దీంతో ఒకరికొకరు పోటీ పడుతూ ఇబ్బడి ముబ్బడిగా తెలంగాణలో బ్రాంచీలు నెలకొల్పుతూ పోయారు.

ఉదహరణకు నారాయణ కాలేజికి 225 బ్రాంచీలుంటే అందులో కేవలం 185 తెలంగాణలోనే ఉన్నాయి. శ్రీచైతన్య కాలేజికి 185 బ్రాంచీలుంటే అందులో 165 కేవలం తెలంగాణలోనే నెలకొల్పారు. అలాగే హైదరాబాద్‌, రంగారెడ్డిలో గాయత్రికి 26 కాలేజిలుంటే ఎన్‌ఆర్‌ఐకి 31 కాలేజిలున్నాయి. నారాయణ కాలేజి వార్షిక టర్నోవర్‌ 800 కోట్లుంటే శ్రీచైతన్య వార్షిక టర్నోవర్‌ 700 కోట్లుంటుంది. మిగతా సీమాంద్ర కార్పోరేట్‌ కళాశాలల వార్షిక టర్నోవర్‌ అంతా కలిపి 1500 కోట్లకు పైగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మా రంగాలలో సైతం ఇదే పరిస్థితి. వీరంతా కలిపి ఇదమిద్దంగా 5 వేల కోట్లకు పైగా తెలంగాణలో వ్యాపారం కొనసాగిస్తున్నారంటే ఆశ్చర్యమేయక మానదు. చదువు పేరు పై వచ్చిన వాళ్ళంతా ఇక్కడే స్థిరపడిపోయి స్థానిక ఉద్యోగాలల్లో కూడా దూరిపోవచ్చు. అందు కే మరి తెలంగాణకు అన్యాయం జరిగినా పరవాలేదు కాని సీమాంద్ర పెట్టుబడులకు మటుకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో కొనసాగుతున్న సమైక్య వాదులకు ఇక తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాదులో మాకు విద్యావకాశాలు ఉండవని భావించే సీమాంద్ర యువతకి ఇక చింత అవసరంలేదు. ఎప్పటిలాగా యధావిధిగా హైదరాబాదు వచ్చి చదువు కోవచ్చు, ఉద్యోగాలు పొందవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇప్పుడున్న యధాతధస్థితి కామన్‌ క్యాపిటల్లో కూడా కొనసాగుతుందనేదే బిల్లు యొక్క సారాంశం.మరి ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క అవసరం ఏముందనేది ప్రశ్న.

ఇక నీటి విషయానికొస్తే గోదావరి, క్రిష్ణా నదులకు సంబందించి నీటి తగువులను తీర్చడానికి వేరు వేరు వాటర్‌ బోర్డులను ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాని విచిత్రం ఏమిటంటే ఏ ఒక్క ప్రాజెక్టులేని గోదావరి పై ఏర్పాటు చేయబోయే వాటర్‌ బోర్డును హైదరా బాదులో ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తున్న క్రిష్ణా నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద మాసనరీ డ్యామ్‌ నాగార్జునా సాగర్‌ కట్టబడినపుడు, దానికి సంబందించిన బోర్డు మటుకు విజయవాడలో పెడతారని సెలవిచ్చారు. ఏలినవారి మర్మాలు ఎవరికి అర్దం అవుతాయిగనుక?

ఏ సమస్యల పునాదుల మూలంగా తెలంగాణ రాష్ట్ర డిమాండు ఏర్పడిరదో ఆ సమస్యలను బిల్లులో ప్రస్తావించకుండా రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఎవరికి సంతోషం? కేవలం రాష్ట్ర ఏర్పాటే తెలంగాణ సమస్యలకు సర్వరోగ నివారిణి కాజాలదు. తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ముఖ్యమో అది ఏర్పడ్డాక తెలంగాణ వాదాన్ని బ్రతికించుకోవడం కూడా అంతే ముఖ్యం. రాష్ట్ర ఏర్పాటుతోనే వలసవాదం సమసిపోతదనుకుంటే పొరపాటే. పైపెచ్చు కామన్‌ క్యాపిటల్‌తో హైదరాబాదులో వలసవాదం సజీవంగా ఉంటుంది. పైగా పెచ్చరిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. శాంతి భద్రతలు గవర్నర్‌ చేతిలో ఉండటం మూలంగా రేపు చీటికి, మాటికి తెలంగాణ వారిపై కేసులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వలసవాదాన్ని తుదముట్టించేంత వరకు తెలంగాణ వాదుల పోరాటం కొనసాగాల్సిన అవస రం ఎంతైనా ఉంది.

- శ్రీధర్‌ ధర్మాసనం
(రచయిత: సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+