డోన్ట్ మిస్: 13న ప్రత్యేక తిథి- చిన్న పనులతో సర్వ దోష పరిహారం
హిందూ ధర్మంలో విజయా ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పద్మ పురాణం, స్కంద పురాణాల్లో ఈ ఏకాదశి గురించి విస్తృతంగా ప్రస్తావించారు. ప్రత్యేకించి- లంకా విజయం కోసం స్వయంగా శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఫాల్గుణ కృష్ణ పక్ష ఏకాదశి నాడు దీన్ని పాటిస్తారు. ఇది విజయం, సకల కార్యసిద్ధి, శత్రువులపై గెలుపునకు ప్రతీక. ఈ నెల 13వ తేదీన శుక్రవారం నాడు ఈ విజయా ఏకాదశి వస్తుంది. దీని పూర్తి కథ, ప్రాముఖ్యత, పూజా విధానాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సాక్షాత్ శ్రీరామచంద్రుడే..
రావణ లంక మీదికి దండయాత్రకు బయలుదేరడానికి సాక్షాత్ శ్రీరామచంద్రుడే అత్యంత భక్తి శ్రద్ధలు, నియమ నిష్టలతో విజయా ఏకాదశి వ్రతాన్ని నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రత ప్రభావంతో ఆయన వానరసేనతో పాటు సునాయాసంగా సముద్రాన్ని దాటగలిగాడు. రావణుడిని సంహరించి, సీతమ్మ అమ్మవారిని విజయవంతంగా తిరిగి తీసుకొచ్చాడు. విజయా ఏకాదశి వ్రతం శత్రువులపై గెలుపు, సకల కార్యసిద్ధికి అత్యుత్తమ సాధనానికి ఇది నిదర్శనం.

సర్వ కార్య సిద్ధి..
పద్మ పురాణం ప్రకారం, విజయా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి అన్ని రంగాల్లో విజయం దక్కుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. విష్ణువును పూజించడం ద్వారా భయం తొలగి, అన్ని కార్యాలు విజయవంతమవుతాయి. జీవితంలో ఆటంకాలు, శత్రుత్వం లేదా వైఫల్యాలు ఎదుర్కొనే వారికి ఇది విశేషంగా ప్రయోజనకరం. ఈ వ్రతం పూర్వజన్మ పాపాలను నశింపజేసి పుణ్యాన్నిస్తుంది. ఈ రోజు చేసే దానధర్మాలు అక్షయ ఫలాలను అందిస్తాయి.
అభిజిత్ ముహూర్తం..
ఫాల్గుణ కృష్ణ పక్ష ఏకాదశి తిథి ఈ నెల 12వ తేదీన ఉదయం 11:32 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు ముగుస్తుంది. ఉదయాతిథి ఆధారంగా విజయా ఏకాదశి వ్రతాన్ని 13వ తేదీన శుక్రవారం నాడు ఆచరిస్తారు. పూజకు అత్యంత శుభప్రదమైన అభిజిత్ ముహూర్తం అదే రోజున మధ్యాహ్నం 12:13 నుండి 12:58 నిమిషాల వరకు ఉంటుంది. వ్రత పారణ 14వ తేదీన ఉదయం 7 నుండి 9:14 గంటల మధ్య చేయాలి.
వ్రత విధానం..
విజయా ఏకాదశి వ్రత విధానం చాలా సులభం. ఉదయం తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. విష్ణుమూర్తి విగ్రహం లేదా పటం ముందు కలశాన్ని స్థాపించి, గంగాజలం, సుగంధ పుష్పాలు, అక్షింతలు, చందనంతో పూజను భక్తిశ్రద్ధలతో ప్రారంభించాలి. భగవంతునికి ఇష్టమైన పసుపు రంగు పువ్వులు, తులసి దళాలు, శనగపప్పు, పలు రకాల స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి.
ద్వాదశి తిథిలో..
పూజ అనంతరం, విష్ణు సహస్రనామం లేదా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మహా మంత్రాన్ని శ్రద్ధగా జపించాలి. సాయంత్రం వేళ దీపం వెలిగించి, శ్రీమన్నారాయణునికి హారతి ఇచ్చి, విజయా ఏకాదశి కథను వినడం శుభప్రదం. రెండవ రోజు ద్వాదశి తిథిలో, నిర్దేశించిన ముహూర్తంలో వ్రత పారణ చేయడంతో పూజా కార్యక్రమం పూర్తవుతుంది. నిష్టగా ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులకు జీవితంలో విజయం, సుఖ సంతోషాలు తప్పక లభిస్తాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications