ఎన్‌కౌంటర్ బయటపెట్టిన నిజం
పత్రికలు రాసిన ప్రకారం- ఈ ఇద్దరిని అధికార తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో దాచి పెట్టారు. వారిని రాజమండ్రి పంపించేందుకు కర్నూలుకు రప్పించారు. ఆ సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఒక అనుచరుడు మరణించాడని తెలియగానే ఆ ఎంపీ తన ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయారు. ఎస్పీ ఎన్‌కౌంటర్ సంగతి చెప్పగానే- స్థానిక ఎన్నికల్లో కావాలనే తనను ఓడించారని, ఇప్పుడు కావాలని ఎన్‌కౌంటర్ చేశారని, ఈ సంగతిని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తానని ఎంపీ మండిపడ్డారట. నంద్యాల డిఎస్‌పి కూడా ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారట. రెండో సారి ఫోన్ చేసి మరణించిన వ్యక్తితో తనకు సంబంధం లేదని చేతులు కడిగేసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications