ప్రవాసబాంధవ్యాలు - భరణం
నేటితరం తల్లిదండ్రులు, యువకులుఎక్కువగా ప్రవాస భారతీయులసంబంధాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.ప్రవాస భారతీయులు కూడా మనదేశంఅమ్మాయిల్నే భార్యలుగా చేసుకోవడానికిఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రవాసభారతీయుల వివాహ ప్రకటనలు కూడాతరుచూ ప్రముఖ పత్రికల్లోకనిపిస్తున్నాయి. ఫోన్‌లో మాట్లాడుకునికంప్యూటర్‌లో ఫొటోలు చూసుకుని వివాహంచేసుకుంటున్నవాళ్లు మనకికనిపిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలుచేస్తున్నవారి ఆదాయం చూసి భారతీయులుఆసక్తి కనబరచడం సహజమే. చాలామంది ప్రవాస భారతీయులు తమతల్లిదండ్రుల ఒత్తిడి మేరకు మనదేశం అమ్మాయిల్నే వివాహం చేసుకొని ఆతర్వాత వారి పట్ల అనాసక్తిప్రదర్శిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.అంతే కాదు తమ వివాహాల రద్దు గురించివిదేశీ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. విదేశీకోర్టులు ఉదారంగా విడాకులు మంజూరుచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఇటీవలికాలంలో పెరిగాయి. తమ బంగారు కలలుకలలుగానే మిగిలిపోవడంతో భారతీయవనితలు నిస్సహాయులై పోతున్నారు. వీరిగురించి ఆలోచిస్తున్న సంస్థలున్నాయా?వ్యక్తులున్నారా? ఇక్కడి అమ్మాయిలతోవచ్చే కట్నకానుకల కోసం ఆశపడి పెళ్లిచేసుకుని ఆ తర్వాత వదిలేస్తున్నవ్యక్తులను అదుపు చేయడానికి ఏదైనాచట్టం ఉందా?












Click it and Unblock the Notifications
