టెకీల ఆరాధ్యదైవం చిలుకూరు వెంకన్న
ఇండియన్, అమెరికా నుంచి
నేను అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్నాను. నేను అందంగా ఉంటాను. ఎబౌయావరేజి అని నమ్మకంగా చెప్పుకోగలను. నా జీవిత భాగస్వామి కూడా ఇదే లెవల్ అందం కలిగిఉండాలని మొదటి నుంచి ఆకాంక్షించాను. కానీ ఆమె యావరేజి.ఆమెలో పెద్ద ఆకర్షణ నాకు కన్పించడం లేదు. నేను మానసికంగా కుంగిపోయాను. ఆమెలో ఆకర్షణను చూసేదెలా? నా డిప్రెషన్ ను పోగొట్టుకునేదెలా?
జవాబుః శారీరక ఆకర్షణ అనేది పెళ్ళయిన కొత్తలో మాత్రమే ప్రగాఢంగా ఉంటుంది. కొంత కాలం పాటే అది సంసార జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ తర్వాత భార్యా భర్తల మధ్య గట్టి అనురాగం, ప్రేమ చోటు చేసుకుంటాయి. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. కాబట్టి మీరు భార్యలో పైపై మెరుగులను కాకఆమె మానసిక సౌందర్యాన్ని ఆరాధించడం ప్రారంభించండి. మీ మనసును పాజిటివ్ గా ఉంచుకుంటే ఆమెలో మీకు ఎన్నో సుగుణాలు కన్పిస్తాయి. ఒకొక్కటిగా ఆ సుగుణాలను ఎనలైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఆలోచిస్తూ ఆమె ఆబ్సెన్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే మీ గుండే జళ్ళు మంటుంది. ఆమె పట్ల మీ మమతానురాగాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి.
స్త్రీలో గానీ పురుషుడిలో గానీ శారీరక సౌందర్యానికి శాశ్వత ప్రాధాన్యత ఉండదు. ఎంత అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా ఆ పై పై మెరుగులు కొంత కాలమే. కాబట్టి మీరు ఫీలవుతున్నది ఒక సమస్య ఎంత మాత్రం కాదు. వైవాహిక జీవితం పట్ల లోతైన అవగాహన లేకపోవడం వల్ల మీరిలా ఫీలవుతున్నారు. ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి. ఏ విషయాన్నీ ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరుల భార్యలతో మీ భార్య అందచందాలను పోల్చుకోకండి. కంపేర్ చేసుకునే మనస్తత్వం మీకు ఏవిధమైనప్రశాంతతను ఇవ్వదు.












Click it and Unblock the Notifications
