అద్వానీ ఇంటి కథ
మిడిమిడి జ్ఞానంతో తొందరపాటు తనంతో వ్యాధిని సరిగ్గా నిర్ధారించకుండానే శక్తిమంతమైన ఔషధాలతో స్పెషలిస్టు ఇచ్చిన ట్రీట్మెంట్ పాప ప్రాణాలను నిలువునా తీసింది. పాప తల్లితండ్రుల గుండెల్లో జీవితకాలానికి సరిపడ క్షోభను మిగిల్చింది. సకాలంలో కరెక్టుగా వ్యాధిని గుర్తించి ట్రీట్మెంట్ చేసివుంటే పాప దక్కేదని తల్లితండ్రులు పడుతున్న ఆరాటాన్ని అర్ధం చేసుకోవడం తప్ప సమాధానం ఎవరు చెప్పగలరు. వెయ్యికాళ్ల జెర్రిలా విస్తరించిన కార్పొరేట్ వైద్యం పట్టా చేతిలో పడగానే లక్షలరూపాయలతో స్టార్హోటళ్లను తలదన్నే ఆస్పత్రును ప్రారంభించి ప్రజల ఆరోగ్యంపై వ్యాపారం చేస్తున్న వైద్యులే దీనికి సమాధానం చెప్పగలగాలి.
పవిత్రమైన వైద్య వృత్తిని కళంకితం చేస్తున్న వ్యాపార ధోరణుల వికృత రూపానికి రమ్య కేసు నిలువెత్తు సాక్ష్యం. కరెన్సీ కట్టలపై మోజు తప్ప రోగుల ప్రాణాల పట్ల ఏ మాత్రం లెక్కలేని వైద్యుల నిర్దయకు నిదర్శనం.












Click it and Unblock the Notifications
