షాక్‌ పై ప్రవాసాంధ్రుల స్పందన

ప్రత్యూష కేసులో ప్రత్యక్ష సాక్షి సిద్ధార్థ రెడ్డితో మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా ఆమె అడుగుతున్నారు. సిద్ధార్థ రెడ్డికి బ్రెయిన్‌ వాష్‌ చేసి వాంగ్మూలాన్ని తమకు అనుకూలంగా ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఆమె అనుమానం. బిడ్డను కోల్పోయిన తల్లికి ఈ విధమైన అనుమానం రావడం అసహజమేమీ కాదు. సరోజిని అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత లేదా? ప్రత్యూష కేసును సిబిఐకి అప్పగించాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు.

ఫోన్‌ నెంబర్ల గుట్టు
ప్రత్యూష హత్యకు గురైందని వార్తలు వచ్చిన వెంటనే సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష సెల్‌లకు వచ్చిన ఫోన్‌ నెంబర్లను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫిబ్రవరి 23వ తేదీన వారికి ఎవరెవరు ఫోన్లు చేశారు; ఎక్కడెక్కడి నుంచి చేశారనే విషయాలను పరిశీలిస్తే కీలక ఆధారాలు దొరకవచ్చునేమో! ఎందుకు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు? ఈ ఫోన్‌ నెంబర్లలో ఒకటి కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించింది కాగా కొన్ని తెలుగు పరిశ్రమకు సంబంధించినవని, మిగతావి వారి ఇరువురు మిత్రులకు సంబంధించినవని ప్రచారం జరుగుతోంది.

మరో కథనం
తన బంధువు శిరీష ఫోన్‌ చేసినప్పుడు తాను నెక్లెస్‌ రోడ్డులో ఉన్నామని ప్రత్యూష చెప్పింది. ఫిబ్రవరి 23వ తేదీన సోమాజిగూడాలోని ఒక బ్యూటిపార్లర్‌ వద్ద కలుసుకున్న సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష ఆ తర్వాత నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లారని, అక్కడ కారులో వున్న సిద్ధార్థ రెడ్డి మిత్రులు ముగ్గుర్ని వీరు కలుసుకున్నారని అంటున్నారు. ఆ తర్వాత వీరిని వీరందరినీ ఓ ప్రాంతానికి తీసికెళ్లి, సిద్ధార్థ రెడ్డిని గదిలో బంధించి ప్రత్యూషను రేప్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే, జరిగిన దారుణాన్ని భరించలేక సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష పురుగుల మందు తాగారా? అత్యాచారం జరిపినవారే పురుగుల మందు తాగించారా అనే విషయమై కూడా ప్రశ్నలు వేసుకుంటున్నారు.

పిడకల వేటలు
ఇన్ని ప్రధాన విషయాలను పక్కన పడేసి రామాయణంలో పిడకల వేటలా అప్రధాన విషయాలను ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేర్‌ ఆస్పత్రి వైద్యులు సమాచారం అందించిన వెంటనే ఎందుకు ప్రతిస్పందించలేదంటూ హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ ఎం.వి. కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు. కేంద్ర నేర పరిశోధక విభాగం (సిసిఎస్‌) ఒక నివేదికను కమిషనర్‌కు అందజేసినట్లు, బంజరాహిల్స్‌ పోలీసులను ఈ నివేదిక తప్పు పట్టినట్లు వార్తలు వెలువడతున్నాయి.

దీనికి తోడు, సిఐడి పోలీసులు ఈ కేసులో కావాల్సినంత జాప్యం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు వీరు రంగంలోకి దిగలేదని సమాచారం.

దర్యాప్తునకు అవసరమైన విషయాలను పక్కన పెట్టేసి చిన్న విషయాలను ప్రచారంలోకి తేవడంలోనూ, అసలు విషయాలను కాదని పక్క విషయాలను ప్రధానం చేయడంలోనూ దాగి వున్న ఆంతర్యం ఎవరికి మాత్రం ఎందుకు అర్థం కాదు?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+