మరో అపకార బ్యాంక్‌

దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులకు లష్కర్‌-ఎ- తోయిబా, ఇతర పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే కారణం అయి వుండవచ్చు. అయితే, లష్కర్‌-ఎ- తోయిబాకు చెందిన కార్యకర్తలను, బాంబు పేలుళ్ల నిందితులను గుర్తించడంలో పోలీసులు చాలా చరుగ్గా వ్యవహరించారు. ఎదురు తిరిగిన ఆ నిందితులను పోలీసులు అనివార్య స్థితి కాల్చి చంపారు. పోలీసుల అతి చరుకుదనాన్నే మజ్లీస్‌ ప్రశ్నిస్తోంది. బూటకపు ఎన్‌కౌంటర్లలో వారిని చంపేశారని ఆరోపిస్తోంది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించడానికి మజ్లీస్‌ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

ఇటీవల పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కుని ఎదురు తిరిగే నిందితులు/ నేరస్థులు ఎక్కువయ్యారు. ఆ మధ్య దోపిడీ ముఠా నాయకుడు జిన్నా అనుచరులు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కుని ఎదురు తిరిగారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో జిన్నా అనుచరులు హతమయ్యారు. ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, ఇటీవలే నెల్లూరు జిల్లాలో ఇద్దరు పిల్లల కిడ్నాపర్లు ఇదే తరహాలో హతమయ్యారు. సాయిబాబా గుడి పేలుళ్ల నిందితులు ఇలాగే హతమయ్యారు. ఈ అరాచక శక్తుల ప్రాణాలు పోయినందుకు అశేష ప్రజానీకం హర్షాతిరేకాలు ప్రకటించింది. అరాచకవాదులు, నేరగాళ్లు, ఉగ్రవాదులు హతమైతే ప్రజలు హర్షించడం పరిపాటి. సత్యభామ చేతిలో నరకాసురుడు, రాముడి చేతిలో రావణుడు హతమైనప్పుడు కూడా ఆ యుగాల్లో ప్రజలు ఆనందపడ్డారనే చెప్పుకుంటున్నాం. లోకకటంకుల పీడ వదిలితే సమాజానికి మంచిదే. దీన్నెవరూ కాదనలేరు.

మనం నాగరిక సమాజంలో, ప్రజాస్వామ్య వ్వవస్థలో జీవిస్తున్నామని అనుకుంటున్నాం. అది నిజమే కావచ్చు. కానీ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని చట్టాలు, నియమనిబంధనలు ఉంటాయని మనకు తెలుసు. చట్టాలను అమలు చేయాల్సినవారు, చట్టాల అమలు ద్వారా ప్రజలకు హక్కులను గ్యారంటీ ఇవ్వాల్సినవారు వ్యవహరించే తీరు అందుకు భిన్నంగా లేదా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. పోలీసు వ్యవస్థ పనితీరు మనదాకా వస్తే గానీ అర్థం కాదు. వారు ఏ కేసులో ఎవరిని ఎందుకు ఇరికిస్తారో కూడా తెలియని చీకట్లో ఉన్నాం. ఈ విషయంలో పోలీసులను ప్రశ్నించే పౌరవ్యవస్థ మన సమాజంలో ఇంకా వికసించలేదు. అలా వికసించి వుంటే మన హక్కులను మనం డిమాండ్‌ చేసి పరిరక్షించుకునేవాళ్లం. ఈ స్థితిలో పోలీసులు ఎవరినైనా ఎందుకైనా నిందితులుగా చేసి కేసులు నడపడం సరే, కాల్చి పారేయొచ్చనే న్యాయానికి వత్తాసు పలుకుతున్నట్లు అవుతుందన్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+