• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికల ప్రచారాలే!

By Staff
|

మొత్తంగా తెలుగు వెబ్‌సైట్లలో ఈనాడు.నెట్‌ నెంబర్‌ వన్‌ అని ప్రకటించడం వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడం. మరో ప్రముఖ పత్రిక వార్త కూడా ఈనాడు ప్రకటనకు ప్రతిస్పందిస్తూ, అలెక్సా గిలెక్సా జాన్తా నహీ... ఆన్‌లైన్‌లో మేమే నెంబర్‌ వన్‌ అంటూ సుదీర్ఘమైన వార్త రాసుకున్నది. ఈనాడు, వార్త లేదా మరో దినపత్రిక వాటి పాపులార్టీ కోసం ఏం రాసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఈనాడు పత్రిక అలెక్సా రేటింగ్‌ గురించి ప్రస్తావించింది గనుకనే మేము కలగజేసుకోవల్సివచ్చింది. అలెక్సా రేటింగ్‌ ప్రకారమే చూస్తే దట్స్‌తెలుగు.కామ్‌ దరిదాపుల్లో కూడా సోకాల్డ్‌ అగ్రశ్రేణి పత్రికలు లేవు. నిజానిజాలు పాఠకులే స్వయంగా తెలుసుకునేందుకు యుఆర్‌ఎల్‌ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు దట్స్‌తెలుగు.కామ్‌ పాఠకులంతా ఈ యుఆర్‌ఎల్‌ క్లిక్‌ చేసి వాస్తవం తెలుసుకున్నారని వారి ప్రతిస్పందనబట్టే అర్ధమయింది. కొందరు పాఠకులు మాత్రం మేము క్లయిమ్‌ చేసిన ర్యాంకింగ్‌ను తెలుగుపోర్టల్‌ ర్యాంకింగ్‌ కాదని ఇండియాఇన్ఫోకు సంబంధించిన ర్యాంకింగ్‌ను మేము రాసుకున్నామని అనుమానపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X