ఉసురు తీసిందెవరు?
పరిస్థితి చేయి దాటే పరిస్థితికి వచ్చాక కళ్లు తెరిచి దోమల నివారణ, పరిశ్రుభత గురించి బాకాలూదడం మొదలు పెట్టింది. స్వయంగా వైద్యుడైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మందలించే వరకు ఇటువైపు కూడా దృష్టి సారించలేకపోయారు.
ఇదలా వుంచితే, ప్రభుత్వం వైద్యుల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని వరంగల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ ఆస్పత్రుల పిల్లల వైద్యులంటున్నారు. వ్యాధి నిర్ధారణ జరగడం లేదనేది కూడా నిజం కాదని వారి అభిప్రాయం. పిల్లలకు సోకింది కచ్చితంగా జపనీస్ ఎన్‌కెఫాలిటీస్ వ్యాధేనని వారంటున్నారు.
అయితే జాతీయ సంస్థలు వైద్య నిపుణులు అది వైరల్ ఎన్‌కెఫాలిటీస్ కూడా కావచ్చునని అంటున్నారు. జపనీస్ ఎన్‌కెఫాలిటీస్ కాదని చెప్పడంలోనే వాస్తవాలను మరుగుపర్చే ప్రయత్నం ఉన్నదనే విమర్శ వరంగల్ జిల్లాలో వినిపిస్తోంది. ఇలా వాదిస్తున్న పిల్లల వైద్యులు తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా వారు చెప్పగలిగే స్థితిలోనే ఉన్నారు. జపనీస్ ఎన్‌కెఫాలిటీస్ వ్యాక్సిన్‌ను తెప్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఒకటి రెండు సార్లు ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు సమర్పించింది. వివిధ సమావేశాల్లో వైద్యులు నోటి మాటగా కూడా విజ్ఞప్తులు చేశారు.
అంతేకాదు, జపనీస్ ఎన్‌కెఫాలిటీస్ వ్యాక్సిన్ తెప్పించాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తులు గత రెండు మూడేళ్లుగా చేస్తూనే ఉన్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఇతర దేశాల నుంచి తెప్పించాల్సి వుంటుంది. అయితే ఇది తమ చేతుల్లో లేదని కేంద్ర ప్రభుత్వం తెప్పించాల్సి
వుంటుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయింది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం అంత ప్రాధాన్యమైనదిగా కనిపించలేదని అనుకోవాల్సి వుంటుంది. ఈ స్థితిలో దయ్యం పట్టినట్లు వ్యాధి వ్యాపిస్తుంటే నిస్సహాయతతో వైద్యులు అల్లాడిపోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications
