లాస్ట్ రిసార్ట్.....
హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు అన్ని మతాల వారు ఈ వేడుకల్లో పాల్గొంటారు. హోళీ పండుగకు సంబంధించి పురణాల్లో రకరకాల కథలు వున్నాయి. ఫల్గుణ మాసం పౌర్ణమిరోజు రాత్రి కామదహనం తెల్లవారి రంగుల్లో మునిగితేలుతూ ఆడుకునే హోళీ. హోళికా అనే రాక్షసిని వధించిన రోజు హోళీగా పురాణాల్లో చెప్పబడినప్పటికీ తర్కానికి దగ్గరగా వున్న కథ మాత్రం మన్మధునికి సంబంధించింది. శివుని తపస్సును భగ్నం చేసి పార్వతి పట్ల ఆయనలో శృంగార భావనలు రెచ్చగొట్టడానికి తన పుష్పబాణాలను ప్రయోగించిన మన్మధుడు ముక్కంటి ఉగ్రత్వానికి భస్మమైపోతాడు. మన్మధుడే లేకుండే లోకంలో సౌందర్యం, శృంగారం ఏం కావలి? జీవరాసులన్నీ జడపదార్ధాలుగా మారవా? రతీదేవి పరమశివున్ని కన్నీళ్లతో ప్రార్ధించగా ఆయన కరుణించి మన్మధున్ని పునర్జీవితున్ని చేస్తాడు. మన్మధుడు పునర్జీవితుడైన రోజును హోళీగా జరుపుకోవడం ఆచారమని చెబుతారు. నిజమే మన్మధుడు మళ్లీ పుట్టినప్పుడు జరుపుకునే చందంగానే హోళీ వేడుకలు వుంటాయి.












Click it and Unblock the Notifications
