ఈ అమ్మాయి కాజ అమృతా చౌదరి
ఈ అమ్మాయి పేరు కాజ అమృతా చౌదరి. 2004లో ఇంటర్మీడియట్ పరీక్షలో 897 మార్కులు సాధించింది. కుటుంబ ఆర్ధిక పరిస్ధితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఆమె ఇన్ని మార్కులు సాధించింది. ఆ తర్వాత తిరుపతి లోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బి.ఫార్మసీలో చేరి ఇప్పుడు ఫైనల్ ఇయర్ కు వచ్చింది. యూనివర్సిటీ స్ధాయిలో ఆమె ఇప్పటికీ సెకండ్ ర్యాంక్ లో కొనసాగుతోంది.
భగవంతుడి లీలలు చిత్ర విచిత్రాలు. అమృతా చౌదరి తండ్రి కాజ గంగాధర్ సినిమా రంగంలో పాతికేళ్ళ పాటు ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాడు. కుమార్తె బాగా చదువుకుంటున్న సమయంలోనే ఆయన అనారోగ్యం పాలై ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్ధితి వచ్చింది. గత పదేళ్ళుగా అతనికి నికర ఆదాయం లేదు. దుర్భర దారిద్ర్యంలోనూ చదువుల తల్లి ఆశీస్సులతో ఇంతవరకూ నెట్టుకొచ్చిన అమృత బి ఫార్మసీ తర్వాత ఎమ్ ఫార్మసీ చేయాలనుకుంటోంది. ఆమె తలిదండ్రులు హైదరాబాద్ మధురానగర్ లో చిన్న అవుట్ హౌస్ లో ఉంటున్నారు. సినిమా రంగంలోని కొందరు ప్రముఖులు చేసిన కొంత సహాయం వల్ల ఈ అమ్మాయి కనీసం ఈ స్ధాయికి రాగలింది.
అన్ని దానాల్లోకి విద్యా దానం మహాదానం. ఈ చదువుల తల్లి పుత్రికను ఆదుకుంటే అంతకు మించిన వితరణ మరొకటి ఉండదు. కాజ అమృతా చౌదరి పూర్తి వివరాలను ఇస్తున్నాం. మీరు నేరుగా ఆమెను సంప్రదించవచ్చు. సహాయం చేయవచ్చు. ఆమె ఇ- మెయిల్ : [email protected]
ఇంటి అడ్రస్: బి-30, మధురా నగర్, అమీర్ పేట, హైదరాబాద్- 500 038
ఫోన్ నెంబరు: 9246331885, ఇంటి నెంబర్ : 040- 64527885












Click it and Unblock the Notifications
