రాఖీ సావంత్ మరో గొడవ

అయితే ఈ కేసు విషయంలో పోలీసులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదట. ఎస్ యమ్ ఎస్ ల విషయంలో కూడా తనకు అన్యాయం జరిగిందని రాఖీ సావంత్ అంటోంది. రియాల్టీ షోలో ఎస్ యం ఎస్ లు రాకుండా చానెల్ బ్లాక్ చేసిందని రాఖీతో పాటు అభిషేక్ అవస్తి ఆరోపించారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ షోలో డజను జంటలు పాల్గొన్నాయి. ప్రథమ బహుమతి పొందిన నటి సంజీదా షేక్, ఆమె కొరియోగ్రాఫర్ అమీర్ అలీ స్టార్ ప్లస్ కు చెందిన పలు సీరియళ్లలో నటిస్తున్నారని వారంటున్నారు. తనను బలవంతందా ముద్దు పెట్టుకున్నాడని ఆరోపిస్తూ గాయకుడు మికాపై గతంలో రాఖీ సావంత్ ఫిర్యాదు చేసింది. అయితే రాఖీదంతా పబ్లిసిటీ స్టంటేనని స్టార్ ప్లస్ వర్గాలు అంటున్నాయి. రాఖీ సావంత్ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications