టీనేజ్ సెక్స్ సమాజానికి మంచిదేనట!!!
టీనేజ్ లో సెక్స్ లో పాల్గొంటే చాలా మంచిదని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. వర్జీనియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. టీనేజ్ లో సెక్స్ లో పాల్గొంటే మంచిదికాదని గతంలో వచ్చిన వాదనలను ఈ అధ్యయనం తోసిరాజంటోంది. టీనేజీలో సెక్స్ లో పాల్గొన్నవారు సమాజానికి తలనొప్పిగా మారతారనే వాదన తప్పని నూతన పరిశోధకులు అంటున్నారు. వయసు ముదిరిన తరువాత సెక్స్ లో పాల్గొన్నవారే యాంటీ సోషల్స్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారంటున్నారు.
టీనేజ్ లో సెక్స్ లో పాల్గొన్నవారే సమాజంలో మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉందని ఈ స్టడీ చెబుతోంది. వారే చక్కని సామాజిక సంబంధాలను కొనసాగించగలుగుతారని వారంటున్నారు. ఈ వివరాలన్నీ ఆన్ లైన్ జర్నల్ యూత్ అండ్....లో వివరించారు. ఈ సంవత్సర ప్రారంభంలో ఇదే జర్నల్ లో ఇదే అంశంపై ప్రచురితమైన ఫలితాలకు తాజా ఫలితాలు పొడగింపుగా ఉన్నాయి. టీనేజ్ లో సెక్స్ లో పాల్గొంటే తరువాతి జీవితంలో ఎలా ప్రవర్తిస్తారనే అంశంలో పరిశోధకులు 534 సేమ్ సెక్స్ ట్విన్ పెయిర్స్ పై ఏడేళ్లపాటు అధ్యయనం చేశారు. మూడు దశలుగా పరిశోధనల ఫలితాలను విభజించారు. ఈ అధ్యయనంలో ఆశ్చర్యకర అంశాలు బయటపడ్డాయి. టీనేజ్ సెక్స్ వలన సమాజ వ్యతిరేక శక్తులుగా కాకుండా సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. టీనేజ్ సెక్స్ వలన వ్యతిరేక శక్తులు కొద్ది సంవత్సరాలలో తగ్గే అవకాశం కూడా ఉందని అధ్యయనానికి అధ్యక్షత వహించిన కాత్రిన్ పేయిగ్ హార్డెన్ అంటున్నారు.












Click it and Unblock the Notifications