పాలమూరుని నేను
గజ్జె కడుతమన్నారు నాకు గల్లు గల్లు మనిపించమని
గాజులేస్తామన్నారు నాకు గల గల మనిపించమని
గాజులెన్దుకు గజ్జెలెన్దుకు గతకనింకే ఇంత గంజి చాలు
గాజులెన్దుకు గజ్జెలెన్దుకు గతకనింకే నాబిడ్డకు గంజి చాలు
పాలమూరు తల్లిని నేను తెలంగాణా పేద బిడ్డని నేను
పాలమూరు తల్లిని నేను తెలంగానకే పేద బిడ్డని నేను
అన్దలమెక్కిస్తమన్నరు అంగరంగ వూరేగిస్తామన్నారు
అది చేస్నామన్నారు ఇది చేస్తామన్నారు
అరచేతిలో వైకుంతం చూఇస్తారు అవకాశం కొరకు ఎదురుచూస్తారు
అంతలోనే కిందకు పడతోస్తారు ఆనక వదిలివేస్తారు
పాలమూరు తల్లిని నేను తెలంగాణా పేద బిడ్డని నేను
పాలమూరు తల్లిని నేను తెలంగానకే పేద బిడ్డని నేను
పండగొస్తే పరేశాన్ పచ్చినీల్లె మా రేషన్
ప్రతిదానికి ఆవేశం పనికి రాని పౌరుషం
అంతలోనే మీనమేశం
పదవులకోసం ఆరాటం పసనేలేని పోరాటం
పాలమూరు తల్లిని నేను తెలంగాణా పేద బిడ్డని నేను
పాలమూరు తల్లిని నేను తెలంగానకే పేద బిడ్డని నేను
ఝార్ఖండ్ లో గోతుల కూలిలుగా మా ఝరి చేతులు
మహారాష్ట్రలో మట్టి తొక్కే మా రైతుల పాదాలు
ముంబాయి బస్సుల నిండా మా మనుషులు
మహాభారతం నిండా మా వలసపు జాడలు
మంచాన పడ్డ మా అయ్యలు అమ్మలు
మనో వేదనతో మా ఊరి కూలీలు
పాలమూరు తల్లిని నేను తెలంగాణా పేద బిడ్డని నేను
పాలమూరు తల్లిని నేను తెలంగాణా పేద బిడ్డని నేను
ఒకప్పటి దక్షిణానీకే ధాన్యాగారం ఈనాడు దయా దాక్షిన్యాలే నాకు ఆధారం
చెరువులు కుంటలు పచ్చని పైర్లు నా గతం
ఎండిన పైర్లూ మండే గుండెలు మాసిన బతుకులు నేటి నా జీవితం
పాలమూరు తల్లిని నేను తెలంగాణా పేద బిడ్డని నేను
పాలమూరు తల్లిని నేను ఆంధ్ర దేశానికే పేద బిడ్డని నేను
ద్విపద రామాయణం రాసిన గోన బుద్ధా రెడ్డి నా మొదటి బిద్దయితే
తెలుగు భాసకే చందం అలంకారం దిద్దిన అప్పకవి నా కడుపటి బిడ్డ
యాలకూత్చి బాల సరస్వతీ , బిజ్జల తిమ్మ భూపలుడిది ఈ గడ్డే
ప్రప్రథమ తెలుగు పత్రిక 'హితవాది' , మొదటి ముద్రణాలయం కూడా నా బిడ్డే
పాలమూరుకు తల్లిని నేను ప్రస్తుతానికి పేద బిడ్డని నేను
పాలమూరు తల్లిని నేను పవిత్ర దేశానికే పేద బిడ్డని నేను

Click it and Unblock the Notifications