ప్రజారాజ్యం లో సినిమా పూజ్యమా?

సినీ పరిశ్రమనుండి రాజకీయాల వైపు వలస వెళ్ళిన వారంతా పార్టీలను పునరావాస కేంద్రంగానే పరిగణించి తమ తమ పనులును నెరవేర్చుకున్నారే గానీ పరిశ్రమకు చేసిందేమీ లేదన్నది సుస్పస్టం. అంతెందుకు కొందరు మేధావులు భాధ పడుతున్నట్లుగా ఈ సంవత్సరం సినీ పరిశ్రమలో ముగ్గురు ప్రముఖుల (బి.యన్.రెడ్డి,ఎల్వీ ప్రసాద్,చక్రపాణి) శత జయంతి సంవత్సరం అయినా వారిని గుర్తు చేసుకుంటూ వారికి శ్రధ్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమాలు ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఇక ఈ అవసరాలన్నీ పూర్తి స్ధాయిలో చేయాలంటే ముప్పై ఏళ్ళకు పైగా సినీ పరిశ్రమతో పూర్తి స్ధాయి అనుభంధం ఉన్న వ్యక్తిగా ఆయన సినీ రంగ అభివృద్దికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా సినీ పరిశ్రమకు,సినీ కార్మికులకు ప్రాణమైన లొ బడ్జెట్ చిత్రాలును సమర్దించాలి. అలాగే మన సినిమాలు అంతర్జాతీయ స్ధాయికి వెళ్ళేలా నాణ్యత పెరిగేలా ప్రభుత్వం భాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లు పెట్టడం,అంతర్జాతీయ సినిమాను సామాన్యంగా బ్రతికే సినిమా వారికి కూడా అందుబాటులోకి తేవటం. అలాగే అలనాటి ఆణిముత్యాలైన తెలుగు క్లాసిక్స్ ని డిజిటల్ టెక్నాలిజీ ద్వారా పూర్తి స్ధాయిలో భద్రపరచాలి. మంచి సినిమాను మన ముందుకు తెస్తున్న ఫిల్మ్ క్లబ్ లకు సహకారం అందించి ఆ ఉద్యమాన్ని కొనసాగించాలి. ఎన్.ఎఫ్.డి.సి తరహాలో కళాత్మక చిత్రాల నిర్మాణం చేపెట్టే దర్శకులకు ఆర్ధిక సహకారం అందించాల్సిన అవసరం ఉంది. యూనివర్శిటీల్లో సినీ సంబంధిత కోర్సులు నిర్వహించి వాటికి తగిన గౌరవం కల్పించాలి. సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీలు తీసేవారిని పోత్సహించాలి. అంతర్జాతీయ ఫిల్మ్ పెస్టివల్స్ లో అవార్డు పొందిన తెలుగు చిత్రాలను ఫిల్మ్ డవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా ప్రచారం కల్పించి వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రపంచ స్ధాయి లైబ్రరీలను(పుస్తకాలు,డీవీడీలుతో) ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సినీ శ్రేయాభిలాషులు చెప్తున్నవి ...ఆశిస్తున్నవి.
ఇక ఇలా తవ్విన కొద్దీ సమస్యలు ఊరుతూ ఉన్న తెలుగు పరిశ్రమ వైపు ఇప్పుడిప్పుడే కార్పోరేట్ సంస్ధలు అడుగులు వేస్తున్నాయి. ఆ ఆఫర్స్ అందుకుని సద్వినియోగం చేసుకునేలా చెయ్యాలంటే సమర్ధులు అయిన వాళ్ళే పూనుకోవాలి. అప్పట్లో తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తెలుగు సినిమా మన సరిహద్ధులను దాటి వెళ్ళటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. దాన్ని గుర్తు చేసుకుని చిరంజీవి అధికారం చేపెడ్తే తాము ఏ తరహా చర్యలు తీసుకోబోతున్మామనేది స్పష్టం చేస్తే బాగుంటుందనేది అందరి ఎదురుచూపు.
ఎందుకంటే కన్న తల్లికే కూడు పెట్టని వాడు పిన తల్లికి చీరపెడతాడట అనే ముతక సామెత నుంచి మెగాస్టార్ తప్పించుకోవాల్సిన అవసరముంది. నిజానికి చాలా మంది రాజకీయ నాయకుళ్ళా కాకుండా ఆయనకు సినీ రంగం సమస్యలపై చక్కని అవగాహన ఉండటం ప్లస్ అవుతుంది.దాంతో ఆయన ఈ దిశగా కూడా ఓ ఎజెండాను రూపొందించి ప్రకటిస్తే సినీ అభిమానులు సంతోషిస్తారనేది నిర్విదాంశం.












Click it and Unblock the Notifications
