'తారే జమీన్ పర్' నేటి అవసరం

Still from Taare Zameen par
వ్యాపార సూత్రాలను అన్వయించి ప్రయోజనాత్మక సినిమాలు తీయవచ్చునని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నిరూపిస్తున్నాడు. లగాన్, రంగ్ దే బసంతి వంటి సినిమాలు తీసిన అమీర్ తారే జమీన్ పర్ అనే సినిమాను తీయడం సాహసమే అనుకోవాలి. ఆధునిక విద్యారంగంలో పిల్లలపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని, పిల్లల ఆసక్తుల పట్ల పెద్దలు అలవరుచుకోవాల్సిన విధానాన్ని, పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని నొక్తి చెబుతూ అమీర్ ఈ సినిమా తీశాడు. ఈ సినిమాకు హీరో హీరోయిన్ల హంగులు, డ్యూయెట్ల హడావిడి, ఐటమ్ సాంగ్స్ ల మసాలాలు ఏవీ లేవు. హీరో అమీర్ ఖాన్ కూడా ఇంటర్వెల్ కు కొద్ది ముందుగా మాత్రమే ప్రవేశిస్తాడు. అది కూడా ఒక ఆర్ట్ టీచరుగా రంగంలోకి దిగి ఇషాన్ అనే విద్యార్థిలోని ప్రతిభను వెలికి తీసే పాత్ర పోషించాడు.

అమీర్ ఖాన్ తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలను చేపట్టడమే కాకుండా తాను మాస్ హీరో అయి ఉండి కథను తన చుట్టూ తిప్పుకునే ఆలోచన చేయలేదు. డిస్లెక్సిక్ (అక్షరాలను గుర్తుపట్టకపోవడం) తో బాధ పడే బాలుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముందు దంతాలు కాస్తా ఎత్తుగా ఉన్న బాలుడు దర్శీల్ సఫారీని కథానాయకుడిగా ఎన్నుకుని అమీర్ ఖాన్ గొప్పగా ఇమోషన్స్ ను పండించగలిగాడు. చిత్రకళపై విశేష మక్కువ ఉండి, చదువులో పూర్తిగా వెనకబడి పోయిన బాలుడు ఇషాన్ అవస్థి పాత్రలో ఆ పిల్లాడు లీనమైన తీరు ఆశ్చర్యంగానే కాకుండా అద్బుతంగా ఉంటుంది. సినిమా యావత్తూ ఆ పిల్లవాడు మనల్ని తన వెంట తీసుకుని పోతాడు.

చదువులో ముందు వరసలో ఉండే ఇషాన్ అవస్తి అన్నయ్య పాత్రని కాంట్రాస్ట్ గా చూపి తల్లిదండ్రుల ధోరణిని సమర్ధంగా చూపాడు అమీర్ ఖాన్. చదువుల పోటీలో వెనకబడి పోయిన ఇషాన్ ఇంట్లో, సమాజంలో, బోర్డింగ్ స్కూళ్లో ఎదుర్కునే మానసిక ఒత్తిడి, తద్వారా అతను క్రమక్రమంగా మనుషులంటేనే భయపడి ముడుచుకు పోతున్న తీరును తెరపై అద్భుతంగా చూపగలిగాడు. అతని సమస్యను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపి అతన్ని తెలివైన, ప్రతిభావంతుడైన విద్యార్థిగా తీర్చి దిద్దిన టీచర్ పాత్రలో అమీర్ కనిపిస్తాడు. అయితే ఆయన ఎక్కడా తన హీరోయిజాన్ని ప్రదర్శించలేదు.

ఆర్ట్ సినిమాలా అనిపించే తారే జమీన్ పర్ కమర్షియల్ గా విజయం సాధించడం అమీర్ ఖాన్ లాంటివారికి ఎంతో ఉత్సాహాన్నిచ్చే విషయం. ఈ సినిమాలో ప్రతి పాత్ర తమ హద్దుల్లో, సహజంగా నటించడం, భావోద్రేకాలను తగు స్థాయిలో ప్రదర్శించడం సినిమాకు ప్రాణం పోసింది. కెమెరా ధ్యాస లేకుండా ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతుంటే షూట్ చేసుకుపోయినంత సహజంగా సినిమా వచ్చింది. ఇషాన్ పాత్రలో నటించిన దర్శీల్ సఫారీ నటన అద్భుతమని చెప్పక తప్పదు.

తారే జమీన్ పర్ సినిమాను ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక ఆరోగ్యానికి ఇటువంటి సినిమాలు ఎన్నైనా అవసరమనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+