గంగూలీ లాగే దాల్మియా

2006లో దాల్మియా సిఎబి అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అప్పటి నుంచి పెద్దగా హడావిడి లేకుండా వ్యవహరించిన ఆయన అకస్మాత్తుగా తిరిగి తన ఉనికిని చాటుకున్నారు. తానొక్కడే కాకుండా తన ప్యానెల్ మొత్తాన్ని ఆయన సిఎబి ఎన్నికల్లో గెలిపించుకున్నారు. ఆయన తన ప్రత్యర్థి ప్రసూన్ ముఖర్జీని ఓడించారు. దాల్మియాకు 71 ఓట్లు రాగా, ముఖర్జీకి 47 ఓట్లు వచ్చాయి. ఈడెన్ గార్డెన్స్ లో ఈ ఎన్నికలు జరిగాయి.
సభ్యులు దాల్మియాను కోరుకున్నారని, అందువల్ల దాల్మియాకు ఓటేశారని, దాల్మియాను తాను అభినందిస్తున్నానని ముఖర్జీ అన్నారు. దాల్మియా ప్యానెల్ లోని ఐదుగురు సభ్యులు ట్రస్టు బోర్డుకు ఎన్నికయ్యారు. డిసెంబర్ సిఎబి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి ముందు 13 ఏళ్లు బోర్టు పనుల్లో తలమునకలయ్యారు. దాల్మియా కోర్టు కేసులను కూడా ఎదుర్కున్నారు. బెంగాల్ తయారు చేసిన ఉత్తమ క్రికెటర్లలో గంగూలీ ఒక్కరని, ఒక్కసారి జాతీయ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడని, అదే రీతిలో దాల్మియా క్రికెట్ బోర్టులోకి వచ్చారని అంటున్నారు.












Click it and Unblock the Notifications
