అమ్మకానికి దక్కన్ చార్జర్స్

దక్కన్ చార్జర్స్ ఎంటర్ ప్రైజ్ విలువు 200 మిలియన్ డాలర్లు, ఇందులో 107 మిలియన్ డాలర్లు ఫ్రాంచైజ్ కూడా ఉంది. జట్టు అమ్మకంపై చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదుకు చెందిన దక్కన్ చార్జర్స్ తొలి పోటీల్లో ఏ మాత్రం మెరుగైన ఆటను ప్రదర్శించలేకపోయినప్పటికీ సమర్థులైన ఆటగాళ్ల వల్ల గిరాకీ బాగానే ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయమై ఐపియల్ గవర్నింగ్ కౌన్సిల్ కు ఎటువంటి సమాచారం లేదని ఐపియల్ కమీషనర్ లలిత్ మోడీ అన్నారు. అయితే అది జట్టు ఫ్రాంచైజ్ ఇష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపియల్ ఫ్రాంచైజ్ సు పబ్లిక్ కు వెళ్లాలని లేదా పెట్టుబడిదారులను వెతుక్కోవాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాళ్లు మైనారిటీ యజమానిని లేదా యజమానులను తెచ్చుకోవచ్చునని, ఈ విషయంలో తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
దక్కన్ చార్జర్స్ జట్టులో లుకలుకలు కూడా ఉన్నాయి. జట్టు కెప్టెన్ గా ఇటీవల వివియస్ లక్ష్మణ్ ను తొలగించి ఆ స్థానంలో ఆడమ్ గిల్ క్రిస్ట్ ను నియమించారు. తొలి ట్వంటీ 20 లీగ్ ద్వారా ఫ్రాంచైజ్ లు బిసిసిఐకి చెల్లించని మొత్తంలో 80 శాతం రాబట్టుకున్నాయని తెలుస్తున్నది.












Click it and Unblock the Notifications