వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ప్రజాపోరాటం -పాఠాలు: సుందరయ్య పుస్తకం

ఆనాటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక, ఆర్ధిక పరిస్ధితులను సుందరయ్య ఈ పుస్తకంలో కళ్ళకు కట్టారు. నిజాంకు వ్యతిరేక పోరాటంలో గెరిల్లా దళాల బలం, బలహీనతలను వివరించారు. పోలీసుల టెర్రర్ ను ఎంతో బాగా రాశారు. అడవుల్లో ఏళ్ళ తరబడి ఉండి నిజాం దళాలకు, ఆ తర్వాత భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ యోధులకు గొప్ప నివాళి వంటిది ఈ పుస్తకం. ఈ పుస్తకం చదవకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి కానీ సమైక్యాంధ్ర ఆందోళన గురించి కానీ మాట్లాడడం అపరిపక్వతే అవుతుంది.
రచయిత పుచ్చలపల్లి సుందరయ్య నిరంతర అధ్యయన చేసేవారు. నిరాడంబరుడు. ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్ళినా ఆయన లోక్ సభకు సైకిల్ మీద వెళ్ళేవారు. ఆ గొప్ప ప్రజానాయకుడు రాసిన ఈ పుస్తకం అందరూ చదువదగినది.
Telangana People's Struggle And Its Lessons @ 5% discount by P.Sundarayya