పక్కా ప్లాన్‌తోనే సూరి హత్య?

హత్య సోమవారం ఉదయం 9మందితో తన ఇంటిదగ్గరనుండి సనత్‌నగర్‌లోని తన లాయరు దగ్గరకు వెళ్లడానికి సూరి బయలుదేరాడు. ఆ సమయంలో సూరితో పాటు భానుకిరణ్, మధుసూధన్ కారులో ఎక్కారు. మరో అనుచరుడు సుధీర్ కారు ఎక్క చూస్తే అతనిని భాను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతో మిగిలిన వారు మరో కారులో బయలుదేరారు. అంతేకాకుండా సూరిని చంపడానికి భాను ఉపయోగించిన తుపాకి సూరి గన్ మెన్ మన్మోహన్ దని పోలీసులు భావిస్తున్నారు. దాంతో వారు గన్ మెన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సూరి తుపాకితో కూడా కాల్పులు జరిపి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
అనుచరులను కారు ఎక్కకుండా అడ్డుకోవడం, తన తుపాకి ఉపయోగించకుండా వేరే తుపాకి ఉపయోగించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుగా పక్కా ప్లాన్‌తోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. జూబ్లీహీల్సు కారు బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డిని కూడా పోలీసులు విచారించారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ నారాయణరెడ్డి నేతృత్వంలో సూరి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 8 బ్లడ్ శాంపిల్సు సేకరించారు. అనంతపురంలో సూరి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత 14 ఏళ్లనుండి సూరి తన స్వంత గ్రామం మద్దెలచెర్వు గ్రామానికి వెళ్లలేదు.












Click it and Unblock the Notifications