వివాదంలో హెల్త్ విలేజ్, గాలిపై మరో పిడుగు

గాలి జనార్దన్ రెడ్డి 2006లో కొంత భూమి కొనుగోలు చేసి, 2007లో డెవలప్‌మెంట్ కోసం శ్రీ వెన్సాయి రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఆ సంస్థ 790 ప్లాట్లను సిద్ధం చేసి 226 ప్లాట్లను ఇప్పటికే అమ్మినట్లు వార్తలు వచ్చాయి. పది ఎకరాలను కూడా దాంట్లో కలుపుకుని గాలి జనార్దన్ రెడ్డి ఫెన్సింగ్ వేయడంతో ఆ ప్రాజెక్టుపై వివాదం చెలరేగుతోంది. ఆ స్థలాన్ని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు శుక్రవారం సందర్శించారు.
గాలి జనార్దన్ రెడ్డి భూకబ్జాపై హనుమంతరావు రెవెన్యూ అధికారులను తప్పు పట్టారు. గాలి నుంచి లంచాలు తీసుకుని శిఖం భూమిలో ప్లాట్లు చేయడానికి అనుమతించారని ఆయన ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలను రియల్టర్స్ ఖండిస్తున్నారు. ఆ పది ఎకరాల్లో తాము ఏ విధమైన ప్లాట్లు చేయలేదని, మిగతా 130 ఎకరాల్లో తగిన అనుమతులు తీసుకుని మాత్రమే ప్లాట్లు చేశామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications