మాజీ నక్సలైట్ నయీమ్ మరణించాడా?

తాను ఎకె 47 రైఫిల్‌ను నయీమ్ కోసం తెచ్చినట్లు ఆయుధాల అక్రమ రవాణా కేసులో అరెస్టైన నగరానికి చెందిన హిజ్బుల్ ముజహిదీన్ కార్యకర్త ముజీబ్జ అహ్మద్ పోలీసులకు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. సొహ్రబుద్దీన్ షేక్ అచూకీని నయీమ్ పోలీసులకు చేరవేసినట్లు కూడా అనుమానాలున్నాయి. సొహ్రబుద్దీన్‌ను గుజరాత్ పోలీసులు హతమార్చినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. 2005లో పౌర హక్కుల నేతల హత్యలకు కూడా నయీమ్ కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్ అనే పేరు మీద వారిని హతమార్చింది నయీమ్ ముఠానే అని పౌర హక్కుల నాయకులు ఆరోపిస్తూ వచ్చారు.
గత కొద్ది కాలంగా కోబ్రాస్ మాట వినిపించడం లేదు. అసలు నయీమ్ ఎక్కడున్నాడనే విషయం మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ నిరుటి వరకు హైదరాబాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దండిగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, నయీమ్ పక్షవాతానికి గురై మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను కేరళలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆంగ్ల దినపత్రిక రాసింది. అయితే, నయీమ్ ఇంకా చురుగ్గానే ఉన్నాడని, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యే అందుకు నిదర్శనమని అనేవాళ్లు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications