కసబ్ ఖర్చు మూడేళ్లలో రూ. 16 కోట్లు

కసబ్ కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఇప్పటి వరకు న్యాయపోరాటం కోసం 12 లక్షల రూపాయలు ఖర్చయినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖంకు 90 రోజులకు గాను ఇచ్చిన డబ్బులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు వాదనల కోసం ఉజ్వల్ నిఖం ఫీజు పెరిగింది. రోజుకు ఆయన పీజు 50 వేల రూపాయలు. ఆయన బిజినెస్ క్లాస్‌లో పని చేస్తున్నారు. ముంబై - ఢిల్లీ రిటర్న్ ట్రిప్ ఖర్చు రూ. 70వేలు ఉంటుంది. ప్రభుత్వ అతిథి గృహంలో విఐపి స్యూట్ కేటాయించాల్సి ఉంటుంది.
కసబ్ హై రిస్క్ ప్రిజనర్ కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భద్రతకు పెట్టే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. అతని తిండికి రోజుకు 27 రూపాయలు అవుతుంది. ఈ ఏడాది జులై వరకు భద్రతకు ప్రభుత్వం 10.87 కోట్లు చెల్చించాల్సి ఉంది. నవంబర్ 26వ తేదీ వరకు ఈ ఖర్చు 14 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. ఏమైనా, కసబ్ మీద ప్రభుత్వం విరివిగానే డబ్బులు ఖర్చు చేస్తుందని భావించాలి, తప్పదు కదా.












Click it and Unblock the Notifications