అపురూప అతిధులకు చేసే సేవలే పెద్దల పండుగ!

వంశంలోని మహాత్ములను గుర్తుంచుకోవడం, మూలాల్ని స్మరించుకోవడం మన హిందూ సాంప్రదాయం. హిందూ ధర్మంలో పితృదేవతలకు చాలా విశాలమైన పరిధి వుంది. మరణించిన ఆత్మీయులు ఎవరైనా పితృదేవతలే. తల్లివైపు, తండ్రి వైపే కాకుండా మరణించిన ఆత్మీయులందరకు ఈ సమయంలో తర్పణలు వదలి వారి ఆత్మలను తృప్తి పరచవచ్చు.
వారసత్వ జ్ఞాపకాల్ని రేపటి తరానికి అందించటానికిగాను మన పూర్వీకులు ఏర్పరచినవి ఈ మహాలయా పక్షాలు. సాంప్రదాయ రీతిలో వీటిని చక్కగా గోత్ర, నామాలతో నదీ తీరాల వెంట ఆచరిస్తే, మన వంటికి, ఇంటికి ఎంతో మేలు కలుగుతుంది. విశిష్టమైన పితృదేవతల ఆశీస్సులు లభించి మానసిక ప్రశాంతత, దానితోపాటు సంపదలు ఏర్పడతాయి. సాంప్రదాయ పద్ధతిలో చేయటానికి అనుకూలత లేనివారు, మధ్యే మార్గంగా వారి పేర్లు తలుచుకుంటూ చేసే ఒకపూట అన్నదానం లేదా పేద విద్యార్ధులకు సహాయం లేదా దిక్కులేని వారికి స్తోమతును బట్టి ఆర్ధిక సహాయం లాంటివి లేదా ఏ సత్కార్యమైనా సరే చేసి కూడా కీర్తిశేషులైన పెద్దలను గౌరవించవచ్చు.












Click it and Unblock the Notifications