సింగనమల స్టోరీ: ఫైనాన్షియర్స్ బెదురు

దాదాపు 90 శాతం మంది నిర్మాతలు ఫైనాన్షియర్స్ నుంచి భారీ వడ్డీలకు డబ్బులు తీసుకునేవారే. తమ బాకీలు చెల్లించేవరకు సినిమాలు విడుదల కాకుండా అడ్డుకోవడానికి సిద్ధపడ్డారు. అనంతపురం జిల్లాకు చెందిన సింగనమల రమేష్ 1990 దశకంలో ఫైనాన్షియర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత భారీ పెట్టుబడులతో భారీ సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. అతను కూడా ఫైనాన్షియర్స్ నుంచి అప్పులు తీసుకోవడం మొదలు పెట్టాడు. అయితే, ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి.
వైజయంతి రెడ్డి అనే ఫైనాన్షియర్స్ నుంచి అప్పు తీసుకున్న సింగనమల రమేష్ దాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. పైగా, డబ్బులు అడిగితే ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. దీంతో అతన్ని చెన్నైలో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఇదే రీతిలో ఫిల్మ్ ఫైనాన్షియర్స్ పలువురు నిర్మాతలపై కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినీ పరిశ్రమలో ఫైనాన్షియర్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారు అందులో భాగం కారు. ప్రస్తుత సమస్యతో 90 శాతం మంది ఫైనాన్షియర్స్ నిర్మాతలకు అప్పులు ఇవ్వడం లేదు.












Click it and Unblock the Notifications