వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సినిమాల కొలిమి, జై తెలంగాణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jai Bolo Telangana
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సినిమాలకు గిరాకీ పెరిగినట్లే ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఉద్యమానికి మరింత ఊపునిచ్చే ఉద్దేశం కూడా ఈ సినిమాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఇమిడి ఉంది. థియేటర్లలో విడుదల చేయడమే కాకుండా ప్రేక్షకుల వద్దకు నేరుగా ఓ సినిమాను తీసుకుని వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నటుడు, న్యాయవాది సివియల్ నర్సింహా రావు రతణాల వీణ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్లు చూపించారు. ప్రజల్లోకి సానుకూల అంశాన్ని తీసుకుని వెళ్లేందుకు ఆ ముగింపు ఇచ్చినట్లు నర్సింహారావు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఓ ఆశావహ దృక్పథాన్ని కలిగించడం తన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ప్రజల కలలు సాకారమవుతాయనే నమ్మకం తనకు ఉందని కూడా ఆయన అంటున్నారు.

రతణాల వీణ సినిమాను వీధి మలుపుల్లో ప్రజల కోసం ఉచితంగా ప్రదర్శించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ భవనాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రదర్శించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీన్ని థర్జ్ ఫిల్మ్ కాన్సెప్ట్‌గా అభివర్ణిస్తున్నారు. సినిమా చూసినవారు తమకు తోచిన మేరకు డబ్బులు ఇవ్వవచ్చునని అంటున్నారు. ఈ సినిమా నిర్మాత టైటిల్‌ను ప్రజలే అని వేస్తున్నారు. సినిమాకు నర్సింహారావు పెట్టుబడి పెట్టారు. అయితే, కళాకారులు మాత్రం ఉచితంగా సేవలు అందించారు.

శివాజీ ప్రధాన పాత్ర పోషించిన కొలిమి సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను జి. ఉమా పార్వతి, పి. లావణ్య రెడ్డి నిర్మించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు రాసిన పాట కూడా ఉంది. సినిమా కోసం కెసిఆర్ రాసిన రెండో పాట ఇది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో ఆయన ఓ పాట రాశారు. మేలో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. విద్యార్థుల బలిదానాలు ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

జై బోలో తెలంగాణ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. దీని దర్శక నిర్మాత శంకర్ ఆ సినిమాకు సీక్వెల్‌ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమం పతాక స్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ఆలస్యం చేయకూడదని ఆయన భావిస్తున్నారు.

English summary
The stir for a separate Telangana state is set to intensify on celluloid. The filmmakers are hoping that the spurt of films give an added boost to the movement and are even planning unique ways to ensure their message reaches the audience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X