• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రంగ్ దే ఫ్రీడమ్ బస్సు యాత్ర, రఘు దీక్షిత్ కచ్చేరీ

By Pratap
|

బెంగళూర్: ఫ్రీడమ్ బస్సు ద్వారా 43 మంది యువతీయువకులు 65 భారత స్వాతంత్ర్యోత్సవాలను విశిష్టంగా నిర్వహించుకున్నారు. ఫ్రీడమ్ బస్సు కచ్చేరీ ద్వారా మూడు రోజుల పాటు బెంగళూర్ నుంచి పుసాద్ వరకు రోడ్డు యాత్ర చేశారు. లాభాపేక్ష లేని బెంగళూర్‌కు చెందిన రంగ్ దే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సమాజంలోని దిగువ స్థాయి ప్రజలకు తక్కువ వడ్డీతో రంగ్ దే రుణాలు అందజేస్తుంది. రంగ్ దే ఫ్రీడమ్ బస్సు కచ్చేరీ మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి 2000 కిలోమీటర్లు సాగింది. సమాజంపై, మార్పుపై, సాధికారితపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ 72 గంటల పాటు యాత్ర సాగింది.

Raghu Dixit

ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి ఏదో ఒక విధమైన విశిష్ట కార్యక్రమం చేపట్టాలనే రంగ్ దే ఆలోచనలోంచి ఈ వినూత్న కార్యక్రమం పురుడు పోసుకుంది. క్షేత్ర యాత్రకు దారి తీసింది. రంగ్ దే బ్రాండ్ అంబాసిడర్, సోషల్ ఇన్వెస్టర్ రఘు దీక్షిత్ పుసాద్‌లోని రుణగ్రహీతలతో మాట్లాడాలని అనుకున్నారు. మహారాష్ట్రలోని విదర్భలో గల ఈ గ్రామంలో రంగ్ దే పలు కుటుంబాలకు రంగ్ దే అండగా నిలిచింది. దీంతో వారంలోగానే ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది.

ఫ్రీడమ్ బస్సు బెంగళూర్‌లో ఆగస్టు 13వ తేదీన బయలుదేరి 14వ తేదీన పుసాద్ చేరుకుంది. ఆ రోజు ఉదయం ఫ్రీడమ్ బస్సు ప్రయాణికులు రుణగ్రహీతలతో సంభాషించారు. వారితో రఘు దీక్షిత్ కలిశారు. యాత్రికుల్లో చాలా మందికి భిన్నమైన భారతదేశం కళ్లకు కట్టింది. వారు మొదటిసారి పేదలు, అణగారిన వర్గాల ప్రజలు ఉండే ప్రాంత ప్రజలను కలిశారు. వారు రుణగ్రహీతలను కలిసి మాట్లాడినప్పుడు - ఆర్థిక సాధికారతకు రుణాల ప్రాధాన్యం, రంగ్ దే చూపిన ప్రభావం, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రంగ్ దే క్షేత్ర భాగస్వాములు అందిస్తున్న సహాయం అర్థమైంది.

సాయంత్రం వేళ సామాజిక మార్పుపై రఘు దీక్షిత్ కచ్చేరి అందరినీ అలరించింది. ఇటువంటి ప్రత్యేకమైన ప్రేక్షకుల కోసం మొదటి సారి ఆయన ప్రదర్శన ఇచ్చారు. ఈ కచ్చేరికీ రంగ్ దే రుణగ్రహీతల సమాజానికి చెందిన 400 మందికిపైగా దీనికి హాజరయ్యారు. రఘు దీక్షిత్ ప్రదర్శనను చూసి ఆయనతో సంభాషించాలని కలలు కంటూ ఉండేవాడినని, ఈ యాత్ర అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని, భారతదేశంలోని ఓ భాగం పేదరికంతో కొట్టుమిట్టాడుతుందనే విషయం మొదటిసారి అనుభవంలోకి వచ్చిందని, రంగ్ దే ఇక్కడి ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోందని, సామాజిక పెట్టుబడి ప్రాధాన్యాన్ని తాను గుర్తించానని, కొద్దిపాటి సహాయం, ప్రోత్సాహంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద కలలు కనగలరని తెలిసి వచ్చిందని రైడర్స్‌లో ఒకరైన విజయ పడుగురి అన్నారు.

అదే అభిప్రాయాన్ని యాత్రికులు బస్సులో పరస్పరం పంచుకున్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన యాత్ర కొత్త స్నేహాలకు, సామాజిక మార్పు పట్ల భారీ విశ్వాసాన్ని, ఉమ్మడి ఆకాంక్ష భారతదేశంలో అవసరమైన మార్పులు తెస్తుందనే ఆశను ఇనుమడింపజేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On August 13th 2012, 43 young individuals set out on the Freedom Bus to celebrate India’s 65th Independence Day in a unique way. Organized by Rang De, a Bangalore based non-profit that provides low cost loans to undeserved communities, The Freedom Bus Concert was a road trip from Bangalore to Pusad that covered close to 2000 kms and cut across the boundaries of 3 states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more