తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనవరి 1న వడ్డీ కాసుల వాడి రికార్డ్ వసూళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల వేంకటేశ్వర స్వామికి ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజే రూ.4.23 కోట్ల రికార్డు స్థాయి హుండీ ఆదాయం లభించింది. గత ఏడాది తొలి రోజు ఇది రూ.3కోట్ల 80 లక్షలు ఉండగా ఈసారి దాదాపు యాభై లక్షలు ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రూ.4.23 కోట్లే స్వామి వారి ఒక్కరోజు ఆదాయం రికార్డ్. కాగా గత ఏడాది(2011)లో స్వామి వారు రూ.1700 కోట్లను ఆర్జించారు. అందులో హుండీ ద్వారానే సుమారు పదకొండు వందల కోట్లను ఆర్జించారు. వడ్డీలు, బంగారు తదితర విలువైన వస్తువుల డిపాజిట్లు, రోజువారి టిక్కెట్లు అమ్మడం ద్వారా రెండు వందల కోట్లు వచ్చాయి. అంతేకాకుండా భక్తులు సమర్పించిన బంగారం, డైమండ్, వెండి ఉంది. అయితే జనవరి 1వ తేదిన ఒక్కరోజే ఇంత ఆదాయం రావడంతో గత ఏడాది వచ్చిన రూ.1700 కోట్ల కంటే ఈ ఏడాది ఎక్కువ ఉంటుందని టిటిడి భావిస్తోంది.

సామాన్య భక్తులు, వివిఐపి పలు విధాలుగా 2011లో శ్రీవారిని రెండు కోట్ల ఇరవై లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గత ఏడాది స్వామి వారిని దర్సించుకున్న ప్రముఖులలో భారత రాష్ట్రపతి, శ్రీలంక, నేపాల్ అధినేతలు ఉన్నారు. మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గత జూలై 7వ తేదిన పెళ్లి రోజు సందర్భంగా భర్తతో పాటు శ్రీవారిని దర్సించుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్స తన సతీమణితో కలిసి ఏప్రిల్ 2న దర్శించుకున్నారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జనవరి 30న దర్శించుకున్నారు. ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ, ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితరులు దర్శించుకున్నారు.

English summary
The famous hill shrine of Lord Venkateswara near here netted a whopping Rs 1,700 crore income in 2011 during which 22 million devotees, including a galaxy of VVIPs, offered their worship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X