భాను కిరణ్ లింక్స్: చిక్కుల్లో రేవంత్ రెడ్డి?

Revanth Reddy
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో సంబంధాలపై రాజకీయ రంగంలో కూడా కలకలం రేగుతోంది. భూ వివాదాల సెటిల్మెంట్లలో భాను కిరణ్‌ పాత్రపై కూపీ లాగుతున్న సిఐడి పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పేరు ముందుకు వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ భూవివాదాన్ని సెటిల్ చేయడంలో రేవంత్ రెడ్డి భాను కిరణ్‌కు సహకరించాడని సిఐడి పోలీసులు అనుమానిస్తున్నారంటూ ఓ ప్రముఖ టీవీ చానెల్ శనివారం వార్తా కథనాన్ని ప్రసారం చేసింది.

హెచ్‌ఎంటివి వార్తాకథనం ప్రకారం - ఎన్నారై సునీతకు చెందిన మహబూబ్‌నగర్ జిల్లాలోని టకరాజ్‌గుడాలోని 25 ఎకరాల భూమిని భాను కిరణ్ మరో వ్యక్తి పేరు మీద రిజిష్టర్ చేయడానికి రేవంత్ రెడ్డి సహకరించారని సిఐడి గుర్తించింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని విచారించే యోచనలో సిఐడి ఉంది. అయితే, ఆయనను సాక్షిగా పిలువాలా, నిందితుడిగా పిలువాలా అనే సందిగ్ధంలో సిఐడి ఉంది.

ఇంకా ఆ వార్తాకథనం ఇలా తెలియజేసింది - సునీత తండ్రి బోజిరెడ్డి ఆ భూమిని నర్సింగరావు, తదితరుల నుంచి కొన్నాడు. బోజిరెడ్డి మరణం తర్వాత 2006 ఆ భూమిని తన అనుచరుల పేరు మీద రిజిష్టర్ చేయించడానికి భాను కిరణ్ ప్రయత్నించాడు. అయితే, అది సాధ్యం కాలేదు. మళ్లీ 2009లో ప్రయత్నించి శివశేఖర రెడ్డి పేరు మీద దాన్ని రిజిష్టర్ చేయించాడు. ఇందుకు రేవంత్ రెడ్డి సహకరించారని సిఐడి అధికారులు గుర్తించారు.

సునీతను అమెరికా నుంచి పిలిపించడంలో, పత్రాలను భాను కిరణ్ చేతికి చేర్చడంలో, భూమిని రిజిష్టర్ చేయించుకునే విషయంలో ఇబ్బందులు రాకుండా చూడడంలో మాత్రమే రేవంత్ రెడ్డి సహకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఇందులో తనకు ఏ విధమైన ప్రమేయం లేదని, తెలిసినవాళ్లకు సహకరించే పని మాత్రమే తాను చేశానని రేవంత్ రెడ్డి అంటున్నట్లు కూడా ఆ వార్తాకథనం తెలిపింది.

అయితే, ఇదే వార్తాకథనాన్ని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ కూడా ప్రసారం చేసింది. కానీ, ఈ చానెల్ రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు. స్థానిక నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఈ చానెల్ వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+