బోగి మంట: మనసుకు అర్థం, సైంటిఫిక్ పరమార్థం
తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. ఇంట్లోని పాత వస్తువులు తీసుకు వచ్చి మంటల్లో వేసి బోగి మంటలు వేస్తారు. అయితే ఈ బోగి మంటల వెనుక గూడార్థం ఉంది. ప్రతి పండుగ వెనుక ఓ గూడార్థం దాగి ఉంటుంది. బోగిలో కూడా ఓ మంచి సందేశం దాగి ఉంది. మన పెద్దలు పండుగల రూపంలో మంచి మంచి వైజ్ఞానిక విషయాలను అందించారు.
ఇంట్లో ఉన్న పాత వస్తువులను, పనికి రాని పాత సామానును, చెక్క వస్తువులను బోగి మంటల్లో వేస్తారు. ఎప్పటి నుండో మూలన పడి ఉన్న అలాంటి వస్తువుల వల్ల అనారోగ్యం పాలయ్యే ఆస్కారం ఉంది. బోగి పండుగ రోజు పనికి రాని పాత వాటిని తీసుకొచ్చి బోగి మంటల్లో వేయడం ద్వారా ఇంట్లో దుమ్ము, దూళి, సూక్ష్మ క్రీములు పట్టిన చెత్త పోతుంది. ఇందులో మనసుకు కూడా చెప్పే ఓ గూడార్థం ఉంది. మనం కూడా పాత వికారాలను వదిలించుకొని కొత్తగా, ఉత్సాహంగా ఉండాలనేది ఇందులోని భావన.

సంక్రాంతి పండుగలో భాగంగా తొలి రోజు బోగి మంటలు వేస్తారు. ఇంట్లోని పాత సామానును బోగి మంటల్లో వేసి కాల్చివేస్తారు.

పండుగ రోజు రేగు పళ్లు, నువ్వులు తదితర నవ ధాన్యాలను వినియోగిస్తారు. తద్వారా ఇలాంటి ఆరోగ్యకర పదార్థాలు తినమని చెప్పడమే పెద్దల ఉద్దేశ్యం.

ముగ్గులలో గొబ్బెమ్మలతో పాటు నవ ధాన్యాలను ఉంచుతారు. రథం, యమద్వారాల ముగ్గులు ప్రధానంగా వేస్తారు.

అందమైన రంగవల్లులు ప్రతి ఇంటి ముంగింట అలరిస్తాయి.

పాలు పొంగించుట

గంగిరెద్దుల ప్రదర్సన ప్రధాన ఆకర్షణ

పండుగ మూడు రోజులు అయినా పతంగుల ఎగురవేయడం మాత్రం పదిహేను రోజుల ముందు నుండే ప్రారంభమై మరో పది రోజులు సాగుతుంది.
బోగి రోజు రేగు పళ్లు, నువ్వులు తదితర దినుసులను స్నానానికి, దిష్టి తీసేందుకు, పిండివంటలు తినేందుకు ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా ఈ పదార్థాలు ఆరోగ్యానికి మంచివని చెప్పే ఉద్దేశ్యం. అలాగే సీజనల్ ఫుడ్స్ తినాలని కూడా చెప్పటం. పిల్లలందరికీ కలిపి దిష్టి తీస్తారు. తద్వారా మొత్తం కుటుంబాన్ని కలిపి పిల్లలకు చిన్నప్పటి నుండే కుటుంబ విలువలను తెలియజెప్పేందుకు ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications