వరదలు: చిరు ఈజ్ గ్రేట్!, బాబు కోపం(పిక్చర్స్)

న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉత్తరాఖండ్ వరద బాధిత తెలుగు వారిని ఇద్దరు మంత్రులు పట్టించుకున్నారని బాధితులు చెబుతున్నారు. తాము సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నామంటే దానికి కారణం కేంద్రమంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలేనని బాధిత యాత్రికులు చెబుతున్నారు. చార్ ధామ్ యాత్రకు వెళ్లి అక్కడ వరదల్లో చిక్కుకున్న పలు జిల్లాలకు చెందిన భక్తులు ఇళ్లకు చేరుకుంటున్నారు.

అందులో పలువురు చిరు, కోట్లలను ప్రశంసిస్తున్నారు. యాత్రికులు తమ భయానక అనుభవాలు వివరిస్తూనే.. ఉత్తరాఖండ్ నుండి ఢిల్లీలోని ఎపి భవన్‌కు సమాచారం ఇచ్చిన వెంటనే కోట్ల, చిరంజీవిలు స్పందించారని చెబుతున్నారు. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక వాహనాలు, రైళ్లను ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఎపి భవన్‌కు పలుమార్లు వచ్చి తమను పరామర్శించడమే కాకుండా, ఇంటికి చేరుకున్న తర్వాత కూడా తమ సమాచారం అడిగి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు.

చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు యాత్రికులు ఢిల్లీ ఎపి భవన్‌కు చేరుకున్న తర్వాత రెండు మూడుసార్లు వెళ్లి పరామర్శించారు. వారి సౌకర్యాల పైన కూడా ఆరా తీశారు. అదే సమయంలో ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకొని ఉన్న వరద బాధితుల సమాచారం కూడా తెలుసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ బాధితులకు తన ఒక నెల జీతాన్ని ఇచ్చిన చిరంజీవి, పర్యాటక శాఖ ఉద్యోగులు కూడా ఒకరోజు జీతం ఇవ్వాలని విజ్ఢప్తి చేశారు.

అలాగే తన అభిమానులకు కూడా ఆయన పిలుపునిచ్చారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు. ఇటీవల చిరంజీవి అందరి మన్ననలు పొందుతున్నారు. పర్యాటక శాఖను చేపట్టిన చిరు అధిష్టానం మెప్పు పొందడమే కాకుండా, ఇతరుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ బాధితుల మెప్పును కూడా చిరు పొందుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు సైతం ఉత్తరాఖండ్ తెలుగు యాత్రీకుల విషయమై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఓ మంత్రివర్గ బృందం డెహ్రాడూన్ చేరుకొని సహాయక కార్యక్రమాలను సమీక్షిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు డెహ్రాడూన్ వెళ్లారు. తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైద్య బృందాలు తెలుగు యాత్రికులకు చికిత్స అందించేందుకు ఉత్తరాఖండ్ వెళ్లాయి. మరోవైపు భాషతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ బాధితులకు మన మీడియా కూడా కొండంత అండగా నిలుస్తోంది. ఉత్తరాఖండ్‌లో అధికారులుగా ఉన్న మన తెలుగు వారు కూడా ఆదుకుంటున్నారు.

వరదలు: చిరు ఈజ్ గ్రేట్!, బాబు కోపం(పిక్చర్స్)

ఢిల్లీలోని ఎపి భవన్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉత్తరాఖండ్ బాధితులను పరామర్శిస్తున్నారు.

వరదలు: చిరు ఈజ్ గ్రేట్!, బాబు కోపం(పిక్చర్స్)

కృష్ణా జిల్లా విజయవాడలో మాట్లాడుతున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి

వరదలు: చిరు ఈజ్ గ్రేట్!, బాబు కోపం(పిక్చర్స్)

ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవడంలో విఫలమవుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆగ్రహం

 వరదలు: చిరు ఈజ్ గ్రేట్!, బాబు కోపం(పిక్చర్స్)

కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి బాధితుల పట్ల స్పందిస్తున్నారని యాత్రికులు చెబుతున్నారు.

 వరదలు: చిరు ఈజ్ గ్రేట్!, బాబు కోపం(పిక్చర్స్)

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాలుగు రోజుల క్రితం ఉత్తరాఖండ్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు.

వరదలు: చిరు ఈజ్ గ్రేట్!, బాబు కోపం(పిక్చర్స్)

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడమంటూ ప్రార్థన చేస్తున్న పాఠశాల విద్యార్థులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+